అప్పుడు దాన్ని చంద్రబాబు వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు?: అంబటి

చంద్రబాబు నాయుడు తప్పు చేసినందుకే మెడ పట్టుకుని గెంటేశారని తెలిపారు.

అప్పుడు దాన్ని చంద్రబాబు వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారు?: అంబటి

Updated On : July 8, 2024 / 3:26 PM IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. అమరావతిలో రాంబాబు మీడియా సమావేశంలో మాట్లాడుతూ… రాష్ట్ర విభజన వల్ల ఆంధ్రకు అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర విభజన అనంతరం ఏపీకి తొలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు పనిచేశారని చెప్పారు.

పదేళ్లపాటు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాల్సిందని, చంద్రబాబు దాన్ని వినియోగించుకోకుండా ఎందుకు పారిపోయి వచ్చారని నిలదీశారు. చంద్రబాబు నాయుడు తప్పు చేసినందుకే మెడ పట్టుకుని గెంటేశారని తెలిపారు. ఏపీకి రావాల్సింది ఏదీ తీసుకుని రాకుండా ఎందుకు పారిపోయారని నిలదీశారు.

తెలంగాణతో ఉన్న సమస్యలను పరిష్కరించకుండా ఆంధ్రకు అన్యాయం చేశారని అన్నారు. రేవంత్ రెడ్డితో జరిగిన సమావేశంలో అసలు చంద్రబాబు ఏం చర్చించారని ప్రశ్నించారు. విద్యుత్ బిల్లు రూ.7 వేల కోట్లకు పైగా రావాల్సి ఉందని, దానిపై ఎందుకు చర్చించలేదని నిలదీశారు.

పోలవరం ప్రాజెక్టు పరిధిలోని ఏడు మండలాలను తిరిగి ఇచ్చేయాలని తెలంగాణ కోరిందని అన్నారు. ఐదు గ్రామాలను తెలంగాణలో కలిపేందుకు చంద్రబాబు అంగీకరించినట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయని తెలిపారు.

Also Read: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ పాదయాత్రే : సీఎం రేవంత్ రెడ్డి