రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి వైఎస్సార్ పాదయాత్రే : సీఎం రేవంత్ రెడ్డి
వైఎస్ జయంతి సందర్భంగా గాంధీ భవన్, సీఎల్పీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం వైఎస్ జయంతి సందర్భంగా ..

YSR 75th Birth Anniversary Celebrations
CM Revanth Reddy : దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ 75వ జయంతి వేడుకలను గాంధీ భవన్ లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, తోపాటు పలువురు కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ యుఐ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు.
Also Read : వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన
సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో సంక్షేమం అంటే వైఎస్సార్ గుర్తుకు వస్తారని కొనియాడారు. మూసీ అభివృద్ధి, మెట్రో రైలు, హైదరాబాద్లో శాంతి భద్రతల విషయంలో వైఎస్సార్ మాకు స్ఫూర్తి అని అన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిని చేయడం తన లక్ష్యమని వైఎస్సార్ రెండో సారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం సందర్భంగా చెప్పారని రేవంత్ గుర్తుచేశారు. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు స్ఫూర్తి.. వైఎస్సార్ చేవెళ్ల నుంచి ఇఛ్ఛాపురం వరకు చేసిన పాదయాత్రే అని అన్నారు. నిన్నటికి నేను పీసీసీ అధ్యక్షుడి పదవి చేపట్టి మూడేళ్ళు అయింది. వైఎస్సార్ జయంతి సంధర్భంగా 35 మందికి కార్పోరేషన్ ఛైర్మన్ పదవులు ఇచ్చాం. పార్టీ కోసం పనిచేసిన నేతలకు ప్రాధాన్యత ఇవ్వాలనే స్ఫూర్తి వైఎస్సార్ ఇచ్చారని రేవంత్ పేర్కొన్నారు.
Also Read : కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ
వైఎస్ఆర్ జయంతి సందర్భంగా గాంధీ భవన్, సీఎల్పీ సిబ్బందికి సీఎం రేవంత్ రెడ్డి బట్టలు పంపిణీ చేశారు. ప్రతి సంవత్సరం వైఎస్ జయంతి సందర్భంగా గాంధీ భవన్, సీఎల్పీ సిబ్బందికి కేవీపీ రామచంద్రరావు బట్టలు పంపిణీ చేస్తూ వస్తున్నారు. ఈసారి వైఎస్ జయంతి సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డితో కేవీపీ బట్టల పంపిణీ చేయించారు. ఈ సందర్భంగా కేవీపీ మాట్లాడుతూ.. పాదయాత్ర వల్ల వైఎస్ చరిత్ర సృష్టించారు. పేదల గుండెల్లో చెరగని ముద్ర వేశారని అన్నారు.