వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన

వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ జనరల్ స్టేట్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి ...

వైఎస్ఆర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సజ్జల.. వైసీపీ శ్రేణులకు కీలక సూచన

Sajjala Ramakrishna Reddy

Updated On : July 8, 2024 / 12:56 PM IST

YSR 75thBirth Anniversary Celebrations : వైఎస్ రాజశేఖరరెడ్డి 75వ జయంతి వేడుకలను తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో వైసీపీ జనరల్ స్టేట్ సెక్రటరీ సజ్జల రామకృష్ణారెడ్డి, మాజీ మంత్రులు అంబటి రాంబాబు, పార్టీ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడుతూ.. ఉమ్మడి రాష్టంలో సీఎంగా పని చేసి రాష్ట్ర అభివృద్ధికోసం పాటుప‌డిన‌ నాయకుడు రాజశేఖర్ రెడ్డి అని కొనియాడారు. గుర్తుండి పోయే పథకాలు పెట్టి ప్రజల గుండెల్లో నిలిచి పోయారు. ఆయన చనిపోకుండా ఉంటే రాష్టం పరిస్థితి వేరులా ఉండేదని అంబ‌టి రాంబాబు అన్నారు. రాజశేఖర్ రెడ్డికి కూడా ఒడి దుడుకులు వచ్చాయి.. ఆయనే మనకు స్ఫూర్తి. కార్యకర్తలు ఎవరు నిరుత్సాహ పడకుండా ఉండాని అంబ‌టి సూచించారు.

Also Read : వైఎస్ఆర్ జయంతి సందర్భంగా జగన్ భావోద్వేగ ట్వీట్.. కంటతడి పెట్టిన విజయమ్మ

సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వైఎస్ఆర్ అభిమానులకు శుభాకాంక్షలు. సమాకాలిన చరిత్రలో రాజశేఖర్ రెడ్డిని చూశాం. ఆయన స్ఫూర్తి నుండి పుట్టిన పార్టీ వైస్సార్సీపీ. జగన్ మోహన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికోసం, పేద ప్రజలకోసం పనిచేశారు. గడిచిన ఐదేళ్ళలో ఇచ్చిన హామీలన్ని అమలు చేసి ఓట్లు అడిగాం. అయినా, ఫలితాలు వేరుగా వచ్చాయి. రాజకీయాలలో ఒడిదుడుకులు కామన్ అని సజ్జల అన్నారు. రాష్ట్ర పరిస్థితి దారుణంగా ఉందన్న కూటమి.. అమలుకాని హామీలు ఇచ్చారు. రాష్ట్ర పరిస్థితి తెలిసి చంద్రబాబు ఎలా హామీలు ఇచ్చాడని సజ్జల ప్రశ్నించారు.

Also Read : కాంగ్రెస్ పార్టీలోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ

గత పాలనలో కులం, మతం చూడకుండా పథకాలు ఇచ్చామని సజ్జల తెలిపారు. కూటమి అధికారంలోకి వచ్చాక దాడులు పెరిగాయని ఆరోపించారు. కూటమి వచ్చాక అన్ని వ్యవస్థలను బలహీన పరుస్తున్నారు. చంద్రబాబు పాలన రాష్టం మళ్ళీ వెనక్కి వెళ్లేలా ఉంది. రాబోయేకాలంలో పార్టీలో లోపాలను సరిదిద్దుకొని ముందుకు పోతాం. పోరాటం చేయడం జగన్ మోహన్ రెడ్డికి కొత్త కాదు. కార్యకర్తలు అందరూ స్ట్రాంగ్ గా ఉండాలని సజ్జల సూచించారు. ఇచ్చిన హామీలు పక్కదారి పట్టేలా చంద్రబాబు చూస్తున్నాడు. ప్రజల పక్షం వైసీపీ ఉంటుంది. రాబోయే రోజుల్లో అంతా మంచే జరుగుతుందని సజ్జల అన్నారు.