Elephant Killed Couple : చిత్తూరు జిల్లాలో దంపతులను తొక్కి చంపిన ఏనుగు

గ్రామ శివారులో ఒంటరి ఏనుగు ఇష్టారాజ్యంగా కలియ తిరుగుతోంది. ఈ నేపథ్యంలో మరణించిన వారి వద్దకు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు.

Elephant Killed Couple : చిత్తూరు జిల్లాలో దంపతులను తొక్కి చంపిన ఏనుగు

Elephant Killed Couple

Elephant Killed Couple In Chittoor : చిత్తూరు జిల్లాలో ఒంటరి ఏనుగు బీభత్సం సృష్టించింది. ఒంటరి ఏనుగు దంపతులను తొక్కి చంపింది. గుడిపాల మండలం 190 రామాపురం హరిజనవాడలో ఘటన చోటు చేసుకుంది. ఏనుగు దాడిలో మరణించిన భార్యాభర్తలు వెంకటేష్, సెల్విగా గుర్తించారు.

గ్రామ శివారులోని పంట పొలాల పక్కన దంపతులు ఉండగా ఉన్న ఫలంగా ఏనుగు వారిపై దాడి చేసి, తొక్కి చంపింది. గ్రామ శివారులో ఒంటరి ఏనుగు ఇష్టారాజ్యంగా కలియ తిరుగుతోంది.

Elephant Kills: హడలెత్తిస్తోన్న ఏనుగు.. 12రోజుల్లో 16 మందిని చంపేసింది..! భయంతో వణికిపోతున్న ప్రజలు

ఈ నేపథ్యంలో మరణించిన వారి వద్దకు వెళ్లడానికి గ్రామస్తులు భయపడుతున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.