Woman Slits Fiance Throat : వరుడి గొంతు కోసిన కేసులో ట్విస్ట్..! నేరం ఒప్పుకున్న యువతి.. అసలు కారణం విని అంతా షాక్..!
తనకు కాబోయే భర్తపై తానే దాడి చేసినట్లు వధువు పుష్ప ఒప్పకుంది. అంతేకాదు అలా చేయడానికి కారణం ఏంటో కూడా తెలిసింది.

Woman Slits Fiance Throat
Woman Slits Fiance Throat : ఏపీలోని అనకాపల్లి జిల్లా రావికమతంలో వరుడిపై వధువు హత్యాయత్నం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. యువతి.. తనకు కాబోయే భర్త గొంతు కోయడం కలకలం రేపింది. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు కాబోయే భర్త రామునాయుడుపై తానే దాడి చేసినట్లు వధువు పుష్ప పోలీసుల విచారణలో ఒప్పకుంది. అంతేకాదు అలా చేయడానికి కారణం ఏంటో కూడా తెలిసింది. పుష్ప భక్తి మైకమే ఈ దారుణానికి కారణమైంది.
పుష్ప భక్తి మైకంలో మునిగిపోయింది. తనకు పెళ్లి వద్దని, తను దేవుని భక్తురాలిగా ఉంటానని పలు మార్లు తల్లిదండ్రులకు తేల్చి చెప్పింది. అయితే, తల్లిదండ్రులు ఆమె మాటలను పట్టించుకోలేదు. ఆమెకి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇప్పటికే రెండు పెళ్లి చూపులు క్యాన్సిల్ కూడా అయ్యాయి.(Woman Slits Fiance Throat)
దీంతో మూడవది తల్లిదండ్రులు ఒప్పించారు. అయితే, ఇష్టం లేని పెళ్లి చేసుకోలేక పుష్ప డిప్రెషన్ లోకి వెళ్లిపోయింది. ఈ క్రమంలో నిన్న వరుడిని బయటకు తీసుకెళ్లి చంపాలనుకుంది. అనుకున్న ప్రకారమే షాపులో చాకు కొనుగోలు చేసింది. కాబోయే భర్తను దేవుడు సన్నిధికి తీసుకెళ్లి అక్కడ అతడి కళ్లకు చున్నీ కట్టి పీకపై కోసింది.
Telangana : మైనర్ ప్రేమికులు ఆత్మహత్య- ప్రేమజంట వీడియో వైరల్
అసలేం జరిగిందంటే..
పెళ్లి ఇష్టం లేని ఓ యువతి దారుణానికి పాల్పడింది. చాలా వయొలెంట్ గా బిహేవ్ చేసింది. ఏకంగా కాబోయే భర్తను అంతమొందించేందుకు ప్రయత్నించింది. ఏపీలోని అనకాపల్లి జిల్లా రావికమతంలో జరిగిన ఈ దారుణం సంచలనంగా మారింది. పెద్దలు కుదిర్చిన పెళ్లి ఏమాత్రం ఇష్టంలేని యువతి భయంకరమైన పథక రచన చేసింది.
‘నీతో మాట్లాడాలి, ఓసారి రా’ అంటూ కాబోయే భర్తకు ఫోన్ చేసింది. వెంటనే ఆ యువకుడు రావడంతో, అతనిని సాయిబాబా గుడి ఉన్న కొండపైకి తీసుకెళ్లింది. తర్వాత ‘సర్ ప్రైజ్’ అంటూ కళ్లు మూసుకోవాలని కోరింది. కాబోయే భార్య అడగడంతో అతడు వెంటనే కళ్లు మూసుకున్నాడు.
ఇదే అదనుగా ఆ యువతి తనతో పాటు తెచ్చుకున్న పదునైన చాకుతో అతడి గొంతుకోసింది. తీవ్ర రక్తస్రావం కావడంతో యువకుడి పరిస్థితి విషమంగా మారింది. అతడిని అనకాపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Anakapalle : పెళ్లి ఇష్టం లేదని కాబోయే భర్త గొంతు కోసేసింది
కాగా, ఆ యువకుడి పేరు రామునాయుడు. అతడి స్వస్థలం పాడేరు. ఆ యువతిది రావికమతం. వచ్చే నెల 28న వీరి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో దారుణం జరిగిపోయింది. యువతి తీరుతో వరుడు, అతడి బంధువులు షాక్ లో ఉండిపోయారు. బాధితుడి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ యువతిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. కాగా, బాధితుడు.. ఔటాఫ్ డేంజర్ అని డాక్టర్లు చెప్పారు. అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడిందన్నారు. ప్రాణాపాయం తప్పిందని డాక్టర్లు చెప్పడంతో వరుడి తల్లిదండ్రులు, బంధువులు ఊపిరిపీల్చుకున్నారు.