AP Assembly: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై చర్చలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రులు.. Live Updates

స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌లో అవినీతి జరిగిందని, ఒప్పందంపై చంద్రబాబు నాయుడు 13 చోట్ల సంతకాలు చేశారని ఏపీ మంత్రులు అన్నారు.

AP Assembly: స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్‌పై చర్చలో చంద్రబాబుపై నిప్పులు చెరిగిన మంత్రులు.. Live Updates

Andhra Pradesh assembly

AP Assembly Session : ఏపీ అసెంబ్లీ సమావేశాలు రెండోరోజు జరుగుతున్నాయి. డెవలప్‌మెంట్ స్కీమ్‌లో అవినీతికి పాల్పడినట్టు టీడీపీ వాళ్లకు తెలుసని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. టీడీపీ సభ్యులకు చర్చలో పాల్గొనాలనే ఉద్దేశం లేదని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు.

The liveblog has ended.

LIVE NEWS & UPDATES

  • 22 Sep 2023 05:05 PM (IST)

    ఎందుకు పారిపోయారు?: బొత్స

    చర్చకు రావాలని అంటుంటే టీడీపీ నేతలు అందుకు రావడం లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ పై చర్చించకుండా టీడీపీ నేతలు ఎందుకు పారిపోయారని ప్రశ్నించారు.

  • 22 Sep 2023 02:03 PM (IST)

    సీమెన్స్ సంస్థను వాడుకున్నారు

    ప్రజాధనాన్ని దోచుకోవడానికి చంద్రబాబు నాయుడు సీమెన్స్ సంస్థను వాడుకున్నారని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ చేయడానికి చంద్రబాబు తనకు నచ్చిన ప్రైవేటు వ్యక్తులను పెట్టుకున్నారని చెప్పారు.

  • 22 Sep 2023 01:33 PM (IST)

    జైల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలి : పేర్ని నాని

    అసెంబ్లీలో స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చ కొనసాగుతోంది. చంద్రబాబు జైల్లో ఆత్మ పరిశీలన చేసుకోవాలని పేర్ని నాని అన్నారు.

  • 22 Sep 2023 01:19 PM (IST)

    టీడీపీ ఎమ్మెల్యేల‎పై మంత్రి అంబటి ఫైర్

    ఏపీ అసెంబ్లీలో స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై చర్చ కొసాగుతోంది. టీడీపీ ఎమ్మెల్యేల‎పై మంత్రి అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు. అవినీతికి పాల్పడినట్టు టీడీపీ వాళ్లకు తెలుసని అన్నారు.

  • 22 Sep 2023 01:17 PM (IST)

    టీడీపీ సభ్యులకు చర్చలో పాల్గొనాలనే ఉద్దేశం లేదు : మంత్రి బుగ్గన

    స్కిల్ డెవలప్‌మెంట్ స్కాంపై ఏపీ అసెంబ్లీలో చర్చ సాగుతోంది. టీడీపీ సభ్యులపై మంత్రి బుగ్గన రాజేంధ్రనాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులకు చర్చలో పాల్గొనాలనే ఉద్దేశం లేదని మంత్రి బుగ్గన అన్నారు.

  • 22 Sep 2023 12:57 PM (IST)

    ఏపీ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన టీడీపీ

    ఏపీ అసెంబ్లీ సమావేశాలను టీడీపీ బహిష్కరించింది. ప్రభుత్వ తీరును నిరసిస్తూ సమావేశాలను బహిష్కరించింది. రేపటి నుంచి రెండు సభలకూ వెళ్లబోమని టీడీపీ స్పష్టం చేసింది.

  • 22 Sep 2023 11:25 AM (IST)

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై చర్చ

    స్కిల్ డెవలప్ మెంట్ స్కాంపై అసెంబ్లీలో ప్రారంభమైన స్వల్పకాలిక చర్చ
    స్కిల్ డెవలప్ మెంట్ స్కాం ఓ చీకటి ఒప్పందం మాజీ: మంత్రి కన్నబాబు

  • 22 Sep 2023 10:20 AM (IST)

    ఏపీ అసెంబ్లీ లాబీల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య ఆసక్తికర చర్చ

    ఏపీ అసెంబ్లీ లాబీల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రి అనిల్ యాదవ్ మధ్య ఆసక్తికర చర్చ సాగింది. గోరంట్ల బుచ్చయ్య చౌదరితో మీకు ఇదే చివరి సభ అంటూ మాజీ మంత్రి అనిల్ యాదవ్ వ్యాఖ్యలు చేశారు. దీనిపై బుచ్చయ్య చౌదరి స్పందించారు. నాకు కాదు మొత్తం మీ పార్టీకి ఇదే చివరి శాసనసభ అంటూ మంత్రి అనిల్ కి బుచ్చయ్య చౌ దరి కౌంటర్ ఇచ్చారు.

    మీరు ఒక్కరూ వస్తారేమో కానీ మీ పార్టీలో ఇంకా వేరే వాళ్ళు సభకు రారంటూ మంత్రి అనిల్ యాదవ్ కామెంట్ చేశారు. నేను, మా పార్టీ ఈసారి సభకు వచ్చేది ఖాయమని గోరంట్ల బుచ్చయ్య చౌదరి స్పష్టం చేశారు.

  • 22 Sep 2023 10:13 AM (IST)

    మరోసారి వాయిదా పడిన అసెంబ్లీ

    టీడీపీ వాయిదా తీర్మానాన్ని స్పీకర్ తిరస్కరించారు. మరోసారి అసెంబ్లీ వాయిదా పడింది.

  • 22 Sep 2023 10:08 AM (IST)

    అసెంబ్లీ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్.. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్

    ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు. అసెంబ్లీ నుంచి అచ్చెన్నాయుడు, అశోక్ సస్పెండ్ అయ్యారు. సమావేశాలు ముగిసేవరకు సస్పెన్షన్ కొనసాగుతోంది. సభలో వీడియో తీసినందుకు స్పీకర్ చర్యలు తీసుకున్నారు.

  • 22 Sep 2023 10:05 AM (IST)

    ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్

    ఏపీ అసెంబ్లీ నుంచి ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సస్పెన్షన్ కు గురయ్యారు.

  • 22 Sep 2023 10:03 AM (IST)

    వాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన సమావేశాలు

    వాయిదా అనంతరం తిరిగి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి.

  • 22 Sep 2023 10:01 AM (IST)

    టీడీపీ సభ్యులు నోరు అదుపులో పెట్టుకోవాలి : మంత్రి బుగ్గన ఆగ్రహం

    టీడీపీ సభ్యులపై మంత్రి బుగ్గన ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ సభ్యులు నోరు అదుపులో పెట్టుకోవాలని.. ఏది పడితే అది మాట్లాడితే కుదరదని హెచ్చరించారు. సభ్యులు తమను అంత అలుసుగా తీసుకోవద్దన్నారు.

  • 22 Sep 2023 09:54 AM (IST)

    చంద్రబాబు అరెస్ట్ పై ప్రబుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉంది : మంత్రి అంబటి

    చంద్రబాబు అరెస్ట్ పై ప్రబుత్వం చర్చించడానికి సిద్ధంగా ఉందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ప్రాపర్ ఫార్మెట్ లో‌ వస్తే అసెంబ్లీలో చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇది ఒక చక్కని వేదిక... చర్చలో‌ పాల్గొనండి పారిపోవద్దు అని టీడీపీ సభ్యులుకు సూచించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి అంబటి మాట్లాడారు. గతంలో ఎప్పుడు ఇంత యాక్టివ్ గా‌ బాలకృష్ణ లేడు. బావ కళ్ళలో‌ ఆనందం కోసం.. మీసం మీ పార్టిలో తిప్పండి...శాసనసభ లో‌కాదు. మీ తండ్రి వెన్నులో కత్తి దిగిన సంగతి గుర్తు తెచ్చుకో బాలకృష్ణ. బాలకృష్ణకి ఇది మంచి అవకాశం. ఎన్టీఆర్ కుమారులు తండ్రికి ద్రోహం చేశారని అపవాదు ఉంది. మీకొక సూచన.. పగ్గాలు తీసుకోండి మీ ప్రతాపం చూపండి. మీ మీద పడిన మచ్చను తొలగించుకోండి. మీరు రెండు సార్లు గెలిచారు. మీ కుటుంబానికి జరిగిన అన్యాయం గుర్తు తెచ్చుకోండి. మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. మీకు చిత్తశుద్ధి ఉంటే రండి చర్చలో పాల్గొనండి. మీ ఆ్ర్యు మెంట్లు శాసనసభ లో చెప్పుకోండి.

  • 22 Sep 2023 09:49 AM (IST)

    శాసనసభ స్పీకర్ తీరు ఏకపక్షంగా ఉంది : గోరంట్ల బుచ్చయ్య చౌదరి

    శాసనసభ స్పీకర్ తీరు ఏకపక్షంగా ఉందని టీడీపీ శాసనసభ పక్ష ఉపనేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. అధికారపక్షo ప్రతిపక్షంపై దాడికి యత్నిస్తుంటే స్పీకర్ పట్టించుకోవటంలేదన్నారు. అసెంబ్లీలో ఎప్పుడూ ఉత్పన్నం కాని పరిస్థితులు ఇప్పుడు తలెత్తుతున్నాయని తెలిపారు. మంత్రులే విపక్ష సభ్యుల్ని రెచ్చకొట్టడం దుర్మార్గం అన్నారు.

  • 22 Sep 2023 09:47 AM (IST)

    దమ్ము, ధైర్యం ఉంటే అసెంబ్లీలో చర్చిద్దాం రండి : మంత్రి కాకాని

    అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి కాకాని గోవర్దన్ మాట్లాడుతూ ఇద్దరం కూర్చుని చర్చిద్దామని తెలిపారు. శాసనసభలో స్పీకర్ పట్ల ఎంత అనుచితంగా ప్రవర్తిస్తున్నారో నిన్నటి ఘటనతో అర్ధం అవుతుందన్నారు. పార్టీ పొత్తు పెట్టుకోకుండా గెలిచిన నాయకుడు, నిజమైన హీరో జగన్. దమ్ము, ధైర్యం వుంటే అసెంబ్లీ లో చర్చిద్దాం రండి. చంద్రబాబు దోచుకోలేదని చెప్పండి ఎందుకు పారిపోతున్నారు. దేవాలయం లాంటి అసెంబ్లీలో చేసే పనికి బాలకృష్ణ సిగ్గుపడాలి.

  • 22 Sep 2023 09:42 AM (IST)

    ఏపీ అసెంబ్లీలో గందరగోళం, వాయిదా

  • 22 Sep 2023 09:40 AM (IST)

    టీడీపీ ఎమ్మెల్యేలపై మంత్రులు బుగ్గన, అంబటి రాంబాబు ఆగ్రహం

  • 22 Sep 2023 09:37 AM (IST)

    స్పీకర్ పోడియం చుట్టుముట్టిన టీడీపీ సభ్యులు
    టీడీసీ సభ్యుల నిరసనల మధ్యే ప్రశ్నోత్తరాలు

     

  • 22 Sep 2023 09:34 AM (IST)

    ఏపీ అసెంబ్లీలో టీడీపీ సభ్యుల ఆందోళన

  • 22 Sep 2023 09:27 AM (IST)

    రెండో రోజు ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యాయి.