Andhra Pradesh : అనకాపల్లిలో పట్టపగలే బ్యాంకు దోపిడీ..తుపాకీతో బెదిరించి రూ.3 లక్షలు చోరీ
అనకాపల్లి జిల్లాలో ఓ బ్యాంక్‌ను పట్టపగలే అందరూ చూస్తుండగానే లూటీ చేశారు దొంగ. కసింగకోట నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో దుండగుడు తుపాకీతో బెదిరించి రూ.3 లక్షలకు పైగా నదు దోపిడీ చేశాడు.

Bank Robbery In Anakapalle District
bank robbery in anakapalle district : ఉమ్మడి విశాఖపట్నం జిల్లా ప్రస్తుత అనకాపల్లి జిల్లాలో ఓ బ్యాంక్‌ను పట్టపగలే అందరూ చూస్తుండగానే లూటీ చేశారు దొంగ. అనకాపల్లి పట్టణంలోని కసింగకోట నర్సింగపల్లి గ్రామీణ వికాస్ బ్యాంక్‌లో చోరీకి పాల్పడ్డారు దుండగుడు. తనను ఎవ్వరు గుర్తు పట్టకుండా ఉండటానికి ముందు జాగ్రత్తగా హెల్మెట్ పెట్టుకుని బ్యాంకులోకి ప్రవేశించిన దుండగుడు తుపాకీతో సిబ్బందిని బెదిరించి రూ.3 లక్షలు నగదు దోచుకుపోయాడు. పట్టపగలు బ్యాంక్ సిబ్బందిని తుపాకీతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.
కాగా మధ్యాహ్నాం 2.00గంటల ప్రాంతంలో బ్యాంకులో ఉన్న క్యాష్ ను లెక్కపెట్టి అనంతం లంచ్ బ్రేక్ తీసుకుందానుకుంటున్నారు. సరిగ్గా అదే సమయంలో ఓ దుండగుడు హెల్మెట్ ధరించి బ్యాంకులోకి తాపీగా ప్రవేశించాడు. నేరుగా క్యాష్ లెక్కపెడుతున్న క్యాషియర్ ప్రతాప్ రెడ్డి కౌంటర్ వద్దకు వెళ్లి గన్ తో బెదిరించాడు. మీ దగ్గర ఉన్న డబ్బంతా తీసి తన బ్యాగులోపెట్టాలంటూ తుపాకీతో బెదిరించాడు. దీంతో భయపడిపోయిన క్యాషియర్ ప్రతాప రెడ్డి మొత్తం రూ.3 లక్షల 31,320 లను సదరు దుండగుడికి అప్పగించేశాడు. ఆ తరువాత సదరు దుండగుడు నువ్వు సేఫ్ అంటూ హిందీలో మాట్లాడి వచ్చినంత తాపీగా బయటకు వెళ్లిపోయాడు.
కాగా సరిగ్గా క్యాషియర్ క్యాష్ లెక్క పెట్టే సమయంలోనే దుండగుడు రావటం క్యాష్ ఇవ్వమని తుపాకీతో బెదిరించటం క్యాషియర్ ఏమాత్రం ప్రతిఘటించకుండా ఇచ్చేయటంతో పోలీసులు బ్యాంకు సిబ్బందిపై పలు అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆ వ్యక్తి అదే ప్రాంతానికి చెందినవాడా? ముందుగానే రెక్కీ నిర్వహించి దోపిడీకి వచ్చాడా? అతని చేతిలో ఉన్నది నిజమైన తుపాకీయేనా? ఈ దోపిడీలో సిబ్బంది సహకారం ఉందా?అనే పలు కోణాల్లో దర్యాప్తు చేపట్టారు.