AP Curfew : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..జూన్ 10 తర్వాత సడలింపులు!

ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే..పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం..కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూపై ఆంక్షలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ ను జూన్‌ 20 వరకూ పొడిగించింది. అయితే.. జూన్‌10 తర్వాత కర్ఫ్యూ సమయాల్లో పొడిగింపు చేయాలని భావించింది.

AP Curfew : ఏపీలో కర్ఫ్యూ పొడిగింపు..జూన్ 10 తర్వాత సడలింపులు!

Curfew

Updated On : June 7, 2021 / 1:37 PM IST

Covid-19 Curfew AP : ఏపీ రాష్ట్రంలో కరోనా వైరస్ తగ్గుముఖం పట్టడం లేదు. అయితే..పాజిటివ్ కేసులు తక్కువగానే నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం..కరోనా కట్టడికి విధించిన కర్ఫ్యూపై ఆంక్షలు సడలించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కర్ఫ్యూ ను జూన్‌ 20 వరకూ పొడిగించింది. అయితే.. జూన్‌10 తర్వాత కర్ఫ్యూ సమయాల్లో పొడిగింపు చేయాలని నిర్ణయం తీసుకుంది. ఉదయం 6 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటవరకూ కర్ఫ్యూను సడలింపు ఉంటుందని వెల్లడించింది. ప్రభుత్వ కార్యాలయాలు ఉ.8 గంటల నుంచి మధ్యాహ్నం 2 వరకు పని చేస్తాయని వెల్లడించింది.

కరోనాను పూర్తిగా నియంత్రించాలని సీఎం జగన్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం ఉన్న కర్ఫ్యూ 2021, జూన్ 10వ తేదీతో ముగియనున్న సంగతి తెలిసిందే. కర్ఫ్యూతో సత్ఫలితాలు ఇస్తున్న క్రమంలో..మరికొన్ని రోజులు పొడిగిస్తే బెటర్ అని భావించింది రాష్ట్ర ప్రభుత్వం.

కరోనా నియంత్రణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు..తదితర పరిస్థితులను సీఎం జగన్ ఆరా తీస్తున్నారు. కరోనా కేసుల పరిస్థితిపై అధికారులు సీఎం జగన్ కు నివేదికలు సమర్పిస్తున్నారు. కర్ఫ్యూను పొడిగించి..సడలింపుల విషయంలో కొన్ని మార్పులు చేయడం బెటర్ అని సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు.

Read More : AP High Court: కొవిడ్ కేసులపై ఏపీ హైకోర్టు విచారణ