AP Pension Good News: ఉత్తరాంధ్ర ప్రజలకు గుడ్ న్యూస్.. రెండు రోజుల ముందే పెన్షన్ల పంపిణీ
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల పెన్షన్(AP Pension Good News) లబ్ధిదారులకు ఈసారి రెండు రోజుల ముందే పంపిణీ చేయాలని నిర్ణయించింది.
Andhra pradesh govt early pension distribution july 30 north andhra districts
- రెండురోజుల ముందే పింఛన్లు
- భోగాపురం ఎయిర్పోర్ట్ ప్రారంభోత్సవం
- పన్నెండు లక్షలమందికి లబ్ధి
AP Pension Good News: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తరాంధ్ర జిల్లాల పెన్షన్ లబ్ధిదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది. సాధారణంగా ప్రతినెల 1వ తేదీన ఇచ్చే సామాజిక పింఛన్లను ఈసారి రెండు రోజుల ముందే పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ ముందస్తు పంపిణీ నిర్ణయంతో లక్షలాది మంది వృద్ధులు, దివ్యాంగులకు తీవ్ర ఊరట లభించనుంది. ఆగస్టు 1వ తేదీన ప్రతిష్ఠాత్మక భోగాపురం అల్లూరి అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించనున్నారు. ఈ భారీ కార్యక్రమం దృష్ట్యా పరిపాలనా యంత్రాంగం బిజీగా ఉండనుండటంతో, జూలై 30వ తేదీనే పెన్షన్ల (AP Pension Good News)పంపిణీ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. జూలై 29 కల్లా నగదు ఉపసంహరణ పూర్తి చేయాలని స్పష్టం చేసింది.
6 జిల్లాల్లో రూ.514 కోట్లు విడుదల:
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం జిల్లాల్లో ఈ ముందస్తు పంపిణీ జరగనుంది. మొత్తం 11.98 లక్షల మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ.514.42 కోట్లను సిద్ధం చేసింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సమన్వయంతో నేరుగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి నగదు అందజేయనున్నారు.
