AP Inter Results 2025
AP Inter Results 2025: ఏపీలో ఇంటర్ పరీక్షలు పూర్తయ్యి పదిహేను రోజులు దాటేసింది.. ప్రస్తుతం పేపర్ వాల్యుయేషన్ జరుగుతోంది. ఈ ప్రక్రియ మరో వారం రోజుల్లో పూర్తవుతుందని సమాచారం. దీంతో ఫలితాల వెల్లడిపై ఏపీ ఇంటర్మీడియట్ బోర్డ్ సన్నాహాలు చేస్తోంది.
ఏపీలో ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు జరగ్గా.. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు మార్చి 3వ తేదీ నుంచి 20వ తేదీ వరకు జరిగాయి. ప్రస్తుతం పేపర్ల వాల్యుయేషన్ జరుగుతుంది. ఈ ప్రక్రియ ఏప్రిల్ 10 నుంచి 12 తేదీల మధ్యలో పూర్తవుతుందని తెలుస్తోంది. దీంతో ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల 17వ తేదీ తరువాత ఫలితాలను వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈనెల 20వ తేదీలోపు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు వెల్లడిస్తారని సమాచారం.
బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ ఈసారి వాట్సప్ ద్వారా కూడా ఫలితాలు వెల్లడించనుంది. దీంతో విద్యార్థులు తమ ఫలితాలను వాట్సాప్ నెం. 9552300009 ద్వారా లేదా.. అధికారిక వెబ్‌సైట్ https://bieap.apcfss.in/ లేదా https://bie.ap.gov.in/ ద్వారా ఫలితాలు చూసుకోవచ్చు.
ఫలితాలు ఇలా తనిఖీ చేయండి..
♦ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి bieap-gov.org
♦ హోమ్‌పేజీలో ‘AP IPE ఫలితాలు 2025’ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
♦ మొదటి సంవత్సరం లేదా రెండవ సంవత్సరం ఫలితాల లింక్‌ను ఎంచుకోండి.
♦ మీరు లాంగిన్ విండోలోకి వెళ్తారు.
♦ మీ హాల్ టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయండి.
♦ మీ AP ఇంటర్ మార్కుల షీట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది.
♦ మీకు కావాలనుకుంటే డౌన్ లోడ్ ఆప్షన్ లోకి వెళ్లి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
వాట్సాప్ ద్వారా..
♦ ఏపీ వాట్సాప్ గవర్నెన్స్ నెంబర్ 9552300009కు హాయ్ అని మెసేజ్ పెట్టాలి.
♦ సెలెక్ట్ సర్వీస్ లో విద్యా సేవలు ఆప్షన్ ను ఎంచుకోవాలి.
♦ డౌన్ లోడ్ ఏపీ ఇంటర్ ఫలితాలు 2025ను ఎంచుకోవాలి.
♦ హాట్ టికెట్ నెంబర్ ను ఎంటర్ చేసి మెమో డౌన్ లోడ్ చేసుకోవచ్చు.
ఎస్ఎంఎస్ ద్వారా..
మీ ఫోన్లో ఎస్ఎంఎస్ తెరిచి APGEN2 లేదా APGEN1 టైప్ చేసి, స్పేస్ ఇచ్చి మీ రూల్ నెంబర్ ఎంటర్ చేయండి. ఆ తరువాత దాన్ని 5626కు మెసేజ్ చేయండి. మీ ఇంటర్ ఫలితాలు వెంటనే మెసేజ్ రూపంలో వచ్చేస్తాయి.