Womens No Entry In Hanuman Temple : ఈ ఆంజనేయస్వామి ఆలయంలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ .. పొంగళ్లు వండేది నైవేద్యం పెట్టేది మగవారే..
ఈ ఆంజనేయస్వామి ఆలయంలోకి ఆడవాళ్లకు నో ఎంట్రీ ..'సంక్రాంతి పండుగ వస్తే పొంగళ్లు నైవేద్యం పెట్టే మగవారితో ఈ ఆంజనేయస్వామివారి గుడి సందడి సందడిగా మారిపోతుంది. ఆ చుట్టుపక్కల ఎక్కడా ఆడవారు కంటికి కూడా కనిపించరు. పొంగళ్లు వండేది స్వామివారికి నైవేద్యం పెట్టేది మగవారే..పూజా సామాగ్రి కూడా ఆడవారు తాకనే తాకరు.

mans pray and prepare pongal in Hanuman temple
Pongal Festival Womens No Entry In Hanuman Temple : పండుగలైనా, తిరునాళ్లైనా, జాతరలు అయినా అమ్మాయిలు. మహిళలదే సందడి ఉంటుంది. జాతరల్లో వంటల్లో ఆడవారే ఉంటారు. కానీ ఓ ఆంజనేయస్వామి ఆలయంలో జరిగి పొంగళ్ల పండగ చేసేది మాత్రం మగవాళ్లే అన్నీ చేస్తారు. ఎందుకంటే ఈ ఆంజనేయస్వామి ఆలయంలోకి ఆడవాళ్లకు ప్రవేశం ఉండదు. అక్కడ పొంగళ్లను కూడా పురుషులే చేస్తారు..స్వామివారికి వారే స్వయంగా నైవేద్యం పెడతారు. ఆ తరువాత ఆ పొంగలిని వారే తింటారు.. పొంగలి వంటకంలో ఆడవాళ్లు పాల్గొన్నా..పొంగళ్ల పండుగ రోజు ఆడవాళ్లు గుడిలోకి వచ్చినా అరిష్టం జరుగుతుందని నమ్మకం. దీంతో పొంగళ్ల పండుగ రోజున ఆడవాళ్లు గుడిలోకి అడుగు పెట్టరు. కేవలం హారతి తీసుకోవటానికి మాత్రమే గుడి వద్దకు వస్తారు. అదికూడా గుడి బయట నిలబడి హారతి కళ్లకు అద్దుకుని వెళ్లిపోతారు. మిగిలిని అన్ని రోజుల్లోనే ఈ సంజీవ రాయుని ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉంటుంది.కేవలం పొంగళ్ల పండుగ రోజున మాత్రం మహిళలు ఆలయంలోకి ప్రవేశం ఉండదు.
ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలోని పుల్లంపేట మండలంలో తిప్పాయపల్లెలో ఉన్న ఈ ఆంజనేయ స్వామి ఆలయంలో అనాదిగా ఈ ఆచారం కొనసాగుతోంది. ఆంజనేయ స్వామిని ఇక్కడ శ్రీ సంజీవరాయ స్వామివారిగా కొలుస్తారు. ఈ ఆలయంలో సంక్రాంతి రోజున స్వామివారికి పొంగలి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎక్కడయినా దేవుళ్లకు మొక్కులు మొక్కితే ఆడవాళ్లు పొంగళ్లు పెట్టి ఆ మొక్కును తీర్చుకుంటారు. కానీ ఆ ఆలయంలో మాత్రం.. వింతగా ఆడవాళ్ళకి బదులు మగవాళ్లే పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు. ఈ పొంగళ్లను శ్రీ సంజీవరాయ స్వామివారి పొంగళ్లుగా పిలుస్తూ ఉంటారు. ప్రతి సంక్రాంతి పండుగ ముందు వచ్చే ఆదివారం నాడు సంజీవరాయునికి పొంగళ్ళు పెట్టి మొక్కులు తీర్చుకుంటారు మగవారు. ఆదివారం ఉదయం నుంచే పురుషులు పొంగుళ్ల సామగ్రిని బుట్టలో ఆలయానికి తీసుకువచ్చి పొంగళ్ళు పెట్టి సంజీవరాయునికి నైవేద్యంగా సమర్పించారు.
గ్రామంలోని పురుషులంతా ఈరోజు దేవాలయానికి వచ్చి పొంగళ్ళుపెట్టారు. ఈ సందర్భంగా సంజీవరాయున్ని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేస్తారు. తరువాత పొంగళ్ళను సంజీవరాయుని దగ్గరకు తీసుకువచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు.ఆ నైవేద్యాన్ని పక్కన పెట్టి 101 బిందెలతోసంజీవరాయుణ్ని అభిషేకిస్తారు. ఆ తరువాత తిరిగి పొంగళ్ళని సంజీవరాయునికి పూజలు చేసి నైవేద్యాన్ని ఇంటికి తీసుకెళ్తారు.
కేవలం ఈ పొంగళిని మగవారు చేయడమే కాదు.. ఇక్కడ వండిన పొంగల్ని అస్సలు ఆడవారు ముట్టుకోరు.. కేవలం మగవారు మాత్రమే తింటారు. మగవాళ్ళు తప్ప స్త్రీలు ముట్టుకోర అంతేకాదు పొంగళ్ళకు అవసరమైయ్యే సామాను కూడా మహిళలు తాకను కూడా తాకరు. ఇలా చేస్తే కోరిన కోర్కెలు తీరుతాయన్నది వారి నమ్మకం.అరిష్టం అని నమ్ముతారు.