మార్చిలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్స

టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలో నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు.

మార్చిలో ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షలు: మంత్రి బొత్స

Intermediate

Updated On : December 14, 2023 / 4:01 PM IST

టెన్త్, ఇంటర్ పరీక్షలు మార్చిలోనే నిర్వహిస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యా శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ తెలిపారు. మార్చి 18 నుంచి మార్చి 30 వరకు 12 రోజుల పాటు పదో తరగతి పరీక్షలు జరుగుతాయని చెప్పారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పరీక్షా సమయం అని తెలిపారు. సుమారు 6 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు.

మార్చి 1 నుంచి 15 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఒకే రోజు రెండు పరీక్షలు ఉండవని.. ఒకరోజు ఫస్టియర్, మరో రోజు సెకండియర్ పరీక్ష ఉంటుందన్నారు. ఏపీలో ఎన్నికల నేపథ్యంలో విద్యార్థులకు ఇబ్బంది కలగకుండా కాస్త ముందుగానే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించామని మంత్రి బొత్స వివరించారు. పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయనన్నట్టు చెప్పారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాసి, అందరూ పాస్ కావాలని ఆకాంక్షించారు.

Also Read: ఆటలో గెలిచిన సొమ్ముతో ఓ చిన్నారి చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా