Viral Post : ఆటలో గెలిచిన సొమ్ముతో ఓ చిన్నారి చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా

ఇతరులకు ఏదైనా ఇవ్వడంలో ఉన్న ఆనందం మాటల్లో చెప్పలేం. ఆ గుణాన్ని చిన్నతనం నుండి పేరెంట్స్ అలవాటు చేయాలి. అంకిత్ అనే బాలుడు తన ఇంట్లో పనిచేసే వంటమనిషి కోసం ఏం చేశాడో చదవండి.

Viral Post : ఆటలో గెలిచిన సొమ్ముతో ఓ చిన్నారి చేసిన పనికి ఇంటర్నెట్ ఫిదా

Viral Post

Updated On : December 14, 2023 / 1:19 PM IST

Viral Post : పిల్లల్లో చిన్నతనం నుండి దయాగుణం, సేవాభావం పెంపొందాలంటే పేరెంట్స్ వారిని ఆ దారిలో ప్రోత్సహించాలి. ఓ చిన్నారి టోర్నమెంట్స్ ఆడుతూ గెలిచిన సొమ్ముతో తన ఇంట్లో పనిచేసే వంటమనిషికి సెల్ ఫోన్ బహుమతిగా ఇచ్చాడు. ఈ న్యూస్ వైరల్ అవుతోంది.

RTC Conductor : ఫ్రీ ఆర్టీసీ బస్సులో కండక్టర్ నిర్వాకం.. మహిళకు టికెట్ కొట్టిన వైనం, వీడియో వైరల్

పిల్లలకు ఇంట్లో పనివారికి మధ్య ఉండే విలువైన బంధాన్ని తెలిపే స్టోరీ ఒకటి ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. అంకిత్ అనే బాలుడు తను టోర్నమెంట్‌లో గెలిచిన సొమ్ములో రూ.2000 పెట్టి వంటమనిషికి సెల్ ఫోన్ కొనిచ్చాడు. అంకిత్ తండ్రి బాలాజీ (V. Balaji) తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. అంకిత్ వీకెండ్స్‌లో టోర్నమెంట్స్ ఆడుతూ రూ.7 వేలు సంపాదించాడని.. అలా తను దాచుకున్న సొమ్ములో రూ.2000 లు పెట్టి తమ ఇంట్లో కుక్ సరోజకు సెల్ ఫోన్ కొనిచ్చాడని బాలాజీ తన పోస్టులో రాసారు. అంకిత్ కి 6 నెలల వయసున్నప్పటి నుండి కుక్ తనని జాగ్రత్తగా చూసుకుందని కూడా ఆయన రాసారు. అంకిత్ కుక్ సరోజకు సెల్ ఫోన్ బహుమతిగా ఇస్తున్న ఫోటోను కూడా పోస్టు చేశారు.

Allu Arjun : నీటిపై బన్నీ బొమ్మ.. వైరల్ అవుతున్న ఆర్టిస్ట్ టాలెంట్

భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగస్తులు కావడంతో చాలామంది ఇళ్లల్లో పిల్లలు ఎక్కువగా పనివారితో గడపడం మనం చూస్తుంటాం. పసివయసు నుండి పనివారితో వారికి తెలియని అనుబంధం ఏర్పడుతుంది. అంకిత్ కూడా సరోజకు ఎంతో అభిమానంతో సెల్ ఫోన్ కొనిచ్చాడు. ఇక ఈ పోస్టు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. చిన్నతనం నుండి ఇతరులకు ఇవ్వడం అనేది నేర్పించిన తల్లిదండ్రులకు అభినందనలు .. సరైన విలువలతో మీ బిడ్డను పెంచుతున్నారు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెట్టారు.