RTC Conductor : ఫ్రీ ఆర్టీసీ బస్సులో కండక్టర్ నిర్వాకం.. మహిళకు టికెట్ కొట్టిన వైనం, వీడియో వైరల్

కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు.

RTC Conductor : ఫ్రీ ఆర్టీసీ బస్సులో కండక్టర్ నిర్వాకం.. మహిళకు టికెట్ కొట్టిన వైనం, వీడియో వైరల్

RTC Conductor Charges Ticket Fare (Photo : Google)

తెలంగాణలో మహిళలకు ఆర్టీసీ బస్సు ప్రయాణం ఉచితం అని స్వయంగా ప్రభుత్వమే ప్రకటించింది. తెలంగాణ పరిధిలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా మహిళలు ఫ్రీగా జర్నీ చేయొచ్చు. ఇందుకోసం ప్రభుత్వం మహాలక్ష్మి పథకం తీసుకొచ్చింది. డిసెంబర్ 9 నుంచి ఈ స్కీమ్ అమల్లోకి వచ్చింది. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఫ్రీ జర్నీకి సంబంధించి ఇప్పటికే ఆర్టీసీ సిబ్బందికి ఆదేశాలు కూడా అందాయి. మహిళల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేయరాదని స్పష్టమైన ఆదేశాలు ఉన్నాయి. అయితే, ఓ ఆర్టీసీ కండక్టర్ ఇందుకు భిన్నంగా వ్యవహరించారు. మహిళల నుంచి టికెట్ ఛార్జీ వసూలు చేసి వివాదంలో చిక్కుకున్నారు.

నిజామాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న బస్సులో మహిళలకు టికెట్ కొట్టారు కండక్టర్. ఉచిత బస్సు సౌకర్యం ఉందని మహిళా ప్రయాణికులు ఎంత చెప్పినా ఆ కండక్టర్ మాత్రం వినిపించుకోలేదు. టికెట్ తీసి మహిళ చేతిలో పెట్టారు. డబ్బు కూడా తీసుకున్నారు. దీంతో మహిళలు అవాక్కయ్యారు.

Also Read : ఒక్క క్రిమినల్ కూడా లేని ముగ్గురు తెలంగాణ మంత్రులు వీరే..

కండక్టర్ తీరుతో బాధిత మహిళలు తీవ్ర ఆవేదన చెందారు. ఉచిత ప్రయాణం గురించి వివరించినా ఆ కండక్టర్ మాత్రం పట్టించుకోలేదని వాపోయారు. బలవంతంగా తమతో టికెట్ ఛార్జీ వసూలు చేశారని అన్నారు. కండక్టర్ వ్యవహారాన్ని వీడియో తీసి ట్విట్టర్ లో షేర్ చేశారు. దాంతో ఆ వీడియో వైరల్ అయ్యింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపింది.

దీంతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెంటనే స్పందించారు. ఆ కండక్టర్ పై సీరియస్ అయ్యారు. దీనిపై విచారణకు ఆదేశించారు. ‘సంబంధిత కండక్టర్‌ ను డిపో స్పేర్‌ లో ఉంచడం జరిగింది. విచారణ అనంతరం ఆయనపై శాఖపరమైన చర్యలను సంస్థ తీసుకుంటుంది’ అని ట్వీట్ చేశారు సజ్జనార్. ఆ కండక్టర్ పేరు నర్సింహులు అని, బోధన్ డిపోలో పని చేస్తున్నారని తెలిపారు. మహిళల నుంచి టికెట్ ఛార్జీలు వసూలు చేసిన ఉదంతంపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయి ఎంక్వైరీ చేస్తున్నారు.

Also Read : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ఎన్నికల ఫలితాలు చేసిన హెచ్చరిక ఏంటి?