Allu Arjun : నీటిపై బన్నీ బొమ్మ.. వైరల్ అవుతున్న ఆర్టిస్ట్ టాలెంట్

తమకు నచ్చిన హీరోపై అభిమానం చాటుకునేందుకు ఫ్యాన్స్ రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. తాజాగా ఓ అభిమాని బన్నీపై ఎలా అభిమానాన్ని చాటుకున్నాడో చూడండి.

Allu Arjun : నీటిపై బన్నీ బొమ్మ.. వైరల్ అవుతున్న ఆర్టిస్ట్ టాలెంట్

Allu Arjun

Allu Arjun : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కి ఫ్యాన్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. బన్నీకి సంబంధించి ఏ వార్త బయటకు వచ్చినా ఫ్యాన్స్‌కి పండగే. తమ అభిమానాన్ని చాటుకునేందుకు రకరకాలుగా ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా ఓ ఆర్టిస్ట్ నీటిపై వేసిన బన్నీ ఆర్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Ted Sarandos with NTR & Charan : మెగా నందమూరి ఫ్యామిలీలతో నెట్‌ఫ్లిక్స్ CEO మీటింగ్.. ఫొటోలు

అభిమాన హీరో సినిమా రిలీజ్ అంటే ఫస్ట్ డే ఫస్ట్ షో చూడాలనుకునే అభిమానులు ఉంటారు. ఆ స్టార్ పాటలకు తాము కూడా స్పెప్పులు వేస్తుంటారు. వారి స్టైల్‌ని అనుకరిస్తుంటారు. అనుసరిస్తుంటారు. వారిలాగే రెడీ అవుతుంటారు. ఇంట్లో.. బైక్ మీద.. కారులో అన్నిచోట్ల ఆ హీరో ఫోటోలు పెట్టుకుని తిరిగేవారు ఉంటారు. అలా అల్లు అర్జున్‌కి వీరాభిమానులు చాలామంది ఉన్నారు. తమ అభిమానం చాటుకునేందుకు, వారి దృష్టిలో పడేందుకు ఏదో ఒకటి చేస్తుంటారు. ఓ ఆర్టిస్ట్ ఏకంగా నీటిపై అల్లు అర్జున్ బొమ్మ వేసి అందర్నీ ఆకట్టుకున్నాడు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో చూస్తే మనమే ఔరా అంటాం. ఇక బన్నీ చూస్తే..

Ted Sarandos : నిన్న మెగా ఫ్యామిలీ, ఇవాళ నందమూరి ఫ్యామిలీతో నెట్‌ఫ్లిక్స్ CEO మీటింగ్.. తెలుగులో ఏం ప్లాన్ చేస్తున్నారు?

dhrisha_suroiwal అనే ఇన్‌స్టాగ్రామ్ యూజర్ షేర్ చేసిన వీడియోలో  పళ్లెంలో ఉన్న నీటిపై రంగులతో ఓ ఆర్టిస్ట్ అల్లు అర్జున్ బొమ్మను వేయడం కనిపించింది. బొమ్మ మొత్తం పూర్తయ్యాక పుష్ప సినిమాలో మెడపై చేయి పెట్టి ‘తగ్గేదేలే’ అంటూ బన్నీ పెట్టిన ఫోజు కనిపించింది. ఇది చూసిన నెటిజన్లు ఆ బొమ్మ వేసిన ఆర్టిస్టు టాలెంట్‌ను తెగ మెచ్చుకుంటున్నారు. ఇక ఈ వీడియో బన్నీ వరకు చేరితే.. ఆ అభిమాని ఆనందానికి అవధులు ఉండవేమో? అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆగస్టు 15 న విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం అభిమానులు ఆత్రంగా ఎదురుచూస్తున్నారు.

 

View this post on Instagram

 

A post shared by Dhrisha suroiwal (@dhrisha_suroiwal)