ఆంధ్రాలో పట్టణాల కంటే గ్రామాల్లోనే కరోనా వ్యాప్తి ఎక్కువ

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ జనాభా.. కరోనా వ్యాప్తికి ఎక్కువ లోనవుతుంది. పట్టణ జనాభాతో పోలిస్తే గ్రామీణ వాతావరణంలోనే ఎక్కువ వ్యాప్తి జరుగుతుందని సెరో సర్వే తొలిదశలో వెల్లడైంది. అనంతపురం, తూర్పు గోదావరి, కృష్ణా, నెల్లూరు జిల్లాల్లో ఈ సర్వే నిర్వహించారు. పట్టణ జనాభాతో పోలిస్తే గ్రామీణ జనాభాలోనే తక్కువగా ఉంది.
ఇది కృష్ణా జిల్లాలో మరీ ఎక్కువ ఉంది. గ్రామీణ వాతావరణంలో నమోదవుతున్న కేసుల శాతం ఇలా ఉంది. అనంతపురంలో 28.8 శాతం, తూర్పు గోదావరి 19.5 శాతం, నెల్లూరు 13.8 శాతం గా ఉన్నాయి.
పట్టణాల్లో నమోదైన వివరాలను బట్టి కృష్ణాలో 21.7శాతం, అనంతపురంలో 16.7శాతం, తూర్పు గోదావరిలో 14.4శాతం, నెల్లూరులో 8.2శాతం రికార్డు అయినట్లు సర్వే చెబుతుంది.
సెరో సర్వేలెన్స్ అనేది యాంటీబాడీల ఉత్పత్తి ఎంత జరుగుతుందనే కొలమానం. ప్రత్యేకించి ఒక ఇన్ఫెక్షన్ తో ఎంత మంది బాధపడుతున్నారో తెలుసుకోవడానికే ఈ సర్వే. సుమారు 3వేల 750 బ్లడ్ శాంపుల్స్ ఆగష్టు 7నుంచి 12తేదీల మధ్య కలెక్ట్ చేశారు.