AP 10th Students : ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల షెడ్యూల్లో స్వల్ప మార్పులు..
AP 10th Students : ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అలర్ట్
Andhrapradesh
AP 10th Students : ఏపీలో పదో తరగతి పరీక్షలు రాసేందుకు సిద్ధమవుతున్న విద్యార్థులకు అలర్ట్. ఇప్పటికే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ను విద్యాశాఖ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా.. ఆ షెడ్యూల్ లో స్వల్ప మార్పులు చేసింది.
ఏపీ పదో తరగతి పరీక్షల షెడ్యూల్ లో విద్యాశాఖ స్వల్ప మార్పులు చేసింది. ఉగాధి, రంజాన్ నేపథ్యంలో.. ఇంగ్లీష్ పరీక్షను మరుసటి రోజుకు వాయిదా వేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. తొలుత ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం.. ఇంగ్లీష్ పరీక్ష మార్చి 20న జరగాల్సి ఉంది. దీనిని మార్చి 21వ తేదీకి మార్చుతూ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది.

