AP Assembly Session 2024 : ఫిబ్ర‌వ‌రి 5 నుంచి ఏపీ అసెంబ్లీ స‌మావేశాలు

ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 5 సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి.

Andhrapradesh Assembly Sessions to begin from February 5th

AP Assembly Session : ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ స‌మావేశాలు ఫిబ్ర‌వ‌రి 5 సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నాయి. స‌మావేశాల‌కు సంబంధించి నోటిఫికేష‌న్‌ను జారీ చేశారు. ఉద‌యం 10 గంట‌ల‌కు ఉభ‌య స‌భ‌లు ప్రారంభం అవుతాయి. మొద‌టి రోజు రెండు స‌భ‌ల‌ను ఉద్దేశించి గ‌వ‌ర్న‌ర్ అబ్దుల్ నజీర్ ప్ర‌సంగించనున్నారు.

త్వ‌ర‌లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నుండ‌డంతో ఈ సారి పూర్తి స్థాయి బ‌డ్జెట్ కాకుండా ఓటాన్ అకౌంట్ బ‌డ్జెట్‌ను ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. కాగా..సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విష‌యాన్ని బీఏసీ సమావేశంలో నిర్ణ‌యిస్తారు.

ఇదిలా ఉంటే.. సీఎం జ‌గ‌న్ అధ్యక్ష‌త‌న బుధ‌వారం స‌చివాల‌యంలో జ‌రిగిన మంత్రి మండ‌లి స‌మావేశాలు ప‌లు కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు. డిఎస్సీ నోటిఫికేషన్ విడుద‌ల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. మొత్తం 6100 పోస్టుల‌తో డీఎస్సీ నోటిఫికేష‌న్‌ను ఇవ్వాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

AP Cabinet: ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు.. పూర్తి వివరాలు ఇవిగో

ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ సిలబస్, విశ్వవిద్యాల‌యాల్లో నాన్ టీచింగ్ స్టాఫ్ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌సును 62 ఏళ్ల‌కు పెంచుతూ నిర్ణ‌యం తీసుకున్నారు. అట‌వీశాఖ‌లో 689 పోస్టు భ‌ర్తీకి కేబినెట్ ఆమోదం తెలిపింది.