AP Assembly : గవర్నర్ ప్రసంగం.. టీడీపీ బాయ్ కాట్, మార్షల్ రంగ ప్రవేశం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు అందరూ ఊహించినట్లే జరిగింది. తొలిరోజే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టడం ప్రారంభించింది...

AP Assembly : గవర్నర్ ప్రసంగం.. టీడీపీ బాయ్ కాట్, మార్షల్ రంగ ప్రవేశం

Ap Assembly Meetings

Updated On : March 7, 2022 / 11:35 AM IST

TDP Members Boycott : ఏపీ అసెంబ్లీ సమావేశాలు అందరూ ఊహించినట్లే జరిగింది. తొలిరోజే టీడీపీ సభ్యులు ఆందోళనలు చేపట్టడం ప్రారంభించింది. నినాదాలతో సభలో హెరేత్తించారు. గవర్నర్ గో బ్యాక్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేయడంతో సీఎం జగన్ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా..ఇలా చేయడం ఏంటీ ? అంటూ ఆయన సైగలు చేశారు. వెల్ లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు గవర్నర్ ప్రసంగ ప్రతులను చించి విసిరేశారు.

Read More : Andharpradesh : ఏపీ అసెంబ్లీలో రచ్చ స్టార్ట్.. టీడీపీ ఆందోళనలు, నినాదాలు

గవర్నర్ ప్రసంగాన్ని టీడీపీ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రయత్నించారు. నినాదాలు, ఆందోళనలతో గవర్నర్ ఏమి ప్రసంగిస్తున్నారో అర్థం కాకుండా పోయింది. మార్షల్ రంగ ప్రవేశం చేసి ఎమ్మెల్సీలు బీటెక్ రవితో పాటు మరో ఎమ్మెల్సీని బయటకు తీసుకెళ్లారు. దీంతో మార్షల్స్ తో టీడీపీ సభ్యులు వాగ్వాదానికి దిగారు. చివరకు గవర్నర్ ప్రసంగాన్ని బాయ్ కాట్ చేస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు.

Read More : AP : ఏపీ అసెంబ్లీలో చర్చించే ప్రధానమైన అంశాలివే

సోమవారం నుంచి ప్రారంభమైన ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో మొదటి రోజు ఉభయసభలనుద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ప్రసంగించారు. సభ అనంతరం బీఏసీ సమావేశం జరుగుతుంది. ఎన్ని రోజులు సమావేశాలు నిర్వహించాలనే దానిపై ఈ భేటీలో నిర్వహిస్తారు. రెండో రోజు దివంగత మంత్రి మేకపాటి గౌతంరెడ్డికి సభలు సంతాపం తెలియచేస్తాయి. సంతాప తీర్మానం అనంతరం సమావేశం ముగుస్తుంది. 11వ తేదీన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది.