AP : ఏపీ అసెంబ్లీలో చర్చించే ప్రధానమైన అంశాలివే

ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది.

AP : ఏపీ అసెంబ్లీలో చర్చించే ప్రధానమైన అంశాలివే

Ap Assembly

AP Assembly : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2022, మార్చి 07వ తేదీ సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాలు ఏపీలో హాట్‌ టాపిక్‌గా మారాయి. తొలుత సభకు రావొద్దని అనుకున్న టీడీపీ.. మూడు రాజధానులపై కోర్టు తీర్పుతో సభకు హాజరు కావాలని నిర్ణయించింది. చంద్రబాబు మినహా మిగిలిన టీడీపీ సభ్యులంతా సభకు హాజరవుతారు. మూడు రాజధానులతో పాటు ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతామని టీడీపీ నేతలు ప్రకటించారు. దీంతో ఈ సమావేశాల్లో టీడీపీ-వైసీపీ మధ్య మరోసారి తీవ్ర వ్యాగ్యుద్ధం జరిగే అవకాశం ఉంది.

Read More : AP : ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఎన్ని రోజులు ? సభకు టీడీపీ నేతలు

ప్రధానంగా చర్చించే అంశాలు ఈ విధంగా ఉన్నాయి :-
జిల్లాల విభజన – పరిపాలనా వికేంద్రీకరణ, విద్యారంగ సంస్కరణలు, నాడు – నేడు ద్వారా పాఠశాలల అభివృద్ధి, కొత్త విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉన్నత విద్య సిలబస్‌లో మార్పులతో పాటు వైద్య, ఆరోగ్య రంగంపై సభ్యులు చర్చించనున్నారు. అలాగే ఆరోగ్యశ్రీ, నాడు–నేడు ద్వారా ఆసుపత్రులు అభివృద్ధి చెందాయ ? లేదా ? అనే దానిపై కూడా చర్చ జరుగనుంది. కొత్త వైద్య కళాశాలల ఏర్పాటు, ఉద్యోగాల కల్పన, కరోనా నియంత్రణకు చేపట్టిన చర్యలపై మాట్లాడనున్నారు. వ్యాక్సినేషన్, ఆసుపత్రుల్లో ఆక్సిజన్‌ ప్లాంట్ల ఏర్పాటు, ప్రభుత్వ ఉద్యోగుల సంక్షేమం, కొత్త పీఆర్సీ అమలు, ఉద్యోగాల భర్తీతో పాటు రాష్ట్రంలో పెన్షన్ల పెంపుపై కూడా చర్చ జరుగనుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా వృద్ధాప్య, వితంతువులకు పెన్షన్‌ రూ.2,500 ఇస్తున్నామని ప్రభుత్వం వెల్లడిస్తున్న సంగతి తెలిసిందే.

Read More : Andhra Pradesh : ఏపీ అసెంబ్లీ సమావేశాలు.. టీడీపీ పొలిట్ బ్యూరో మీటింగ్

రాష్ట్రంలో ఉపాధి హామీ పథకం అమలు ఎలా జరుగుతోంది ? మౌలిక వసతుల కల్పనపై చర్చించనున్నారు. ఏపీలో శాంతి భద్రతల విషయం, ఇళ్ల పట్టాల పంపిణీ, గృహ నిర్మాణం
.. వెనుకబడిన వర్గాల సంక్షేమంపై చర్చ జరుగనుంది. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల సంక్షేమం, వ్యవసాయ రంగం, ఇన్‌పుట్‌ సబ్సిడీ, సున్నా వడ్డీ రుణాలు, రైతు భరోసా కేంద్రాలు, మద్దతు ధర కల్పనపై ప్రభుత్వం, ప్రతిపక్షం మధ్య చర్చ జరుగనుంది. వైఎస్సార్‌ జలకళ, మహిళా సాధికారత, వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా, సున్నా వడ్డీ, నామినేటెడ్‌ పదవులపై సభ్యులు చర్చించనున్నారు.

Read More : రాజధాని రచ్చకు అసెంబ్లీ రెడీ

గ్రామ సచివాలయాల విషయంలో ప్రజలకు మేలు జరుగుతుందా ? అనే దానిపై అసెంబ్లీలో ప్రభుత్వం చర్చ చేపట్టనుంది. పారిశ్రామిక అభివృద్ధికి తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తుందా ? లేదా అనే దానిపై కూడా సభ్యుల మధ్య చర్చ జరుగనుంది. వ్యవసాయానికి 9 గంటల ఉచిత విద్యుత్‌, విద్యుత్‌ రంగంలో సంస్కరణలు, గత సర్కారు నిర్వాకాలు, బకాయిలపై సభ్యులు చర్చిస్తారు. అమూల్‌ ప్రాజెక్టుతో పాడి రైతులకు మేలు, ప్రభుత్వ హామీలు, అమలు తీరు, పోలవరం, ఇతర సాగునీటి ప్రాజెక్టుల ప్రధాన అంశాలపై చర్చ జరుగనుంది.