గర్భిణులు, చిన్నపిల్లల కోసం ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’

రాష్ట్రంలో 8 జిల్లాల పరిధిలోని 77 గిరిజన మండలాల్లోని గిరిజనులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పేరుతో ఒక కార్యక్రమాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. దీన్ని ఏపీ కేబినెట్ ఆమోదం పలికింది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (2015-16) ప్రకారం తక్కువ బరువుతో పుట్టే శిశువులు, సరైన ఎదుగుదల లేని పిల్లలు, మహిళల్లో రక్తహీనత ఎక్కువగా ప్రాంతాలలో ఈ ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకం ఆసరాగా ఉంటుంది. గర్భంతో ఉండే మహిళలకు..బాలికలకు రక్తహీనత లేకుండా ఉండేందుకు పౌష్టికాహారాన్ని అందజేస్తామని మంత్రి తెలిపారు.
కాగా రాష్ట్రంలో ఏఏ ఏరియాలకు ‘వైఎస్సార్ సంపూర్ణ పోషణ’ పథకం అవసరమో అనే అంశంపై ఇప్పటికే సర్వే పూర్తి అయ్యింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, తూర్పు గోదావరి జిల్లాల్లో ఉన్నట్లు తేలింది. గుంటూరు, ప్రకాశం, కర్నూలు జిల్లాల్లోని గిరిజనులు, ఆదివాసీల్లో కూడా పౌష్టికాహార లోపం, రక్తహీనత ఎక్కువగా ఉన్నట్లు గుర్తించింది. పేదరికం, పౌష్టికాహారంపై అవగాహన లేకపోవడం, సురక్షిత మంచినీరు తదితర అంశాల వల్ల ఈ సమస్యలు వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అదనపు పౌష్టికాహారాన్ని వైఎస్సార్ సంపూర్ణ పోషణ కింద అందచేసేందుకు నిర్ణయించింది.
8 జిల్లాల్లో విస్తరించిన 7 ఐటీడీఏల పరిధిలో 6 నుంచి 72 నెలల పిల్లలకు, బాలింతలకు, గర్భిణులకు పౌష్టికాహారాన్ని అందచేయనుంది. ఐడీడీఏ పీవోలు పథకం అమలు పర్యవేక్షిస్తారు. అంగన్‌వాడీ కార్యకర్తలు అర్హులైన పిల్లలను, మహిళలను సర్వే చేసి గుర్తిస్తారు. వీరికి అవసరమైన మేరకు బాలామృతం, పాలపొడి సరఫరా చేస్తారు.
Read: టీడీపీ అక్రమాలపై సీబీఐ విచారణకు ఏపీ కేబినెట్ ఆమోదం: పేదలకు చేయూతనిచ్చే పలు నిర్ణయాలు