Amaravati Lands : రాజధాని అమరావతిలో 13 సంస్థల భూకేటాయింపులు రద్దు.. క్యాబినెట్ సబ్ కమిటీ కీలక నిర్ణయం
అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.

Amaravati Lands : ఏపీ రాజధాని అమరావతిలో గతంలో భూములు పొందిన 13 సంస్థలకు ఆయా కేటాయింపులు రద్దు చేస్తూ మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం తీసుకుంది. వివిధ కారణాలతో కేటాయింపుల రద్దుకు సబ్ కమిటీ ఆమోద ముద్ర వేసింది. 2014-19 మధ్య కాలంలో అమరావతిలో భూములు కేటాయించిన సంస్థల విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుంది. అమరావతిలో గతంలో 131 సంస్థలకు భూములు కేటాయించినట్లు మంత్రి నారాయణ తెలిపారు.
వీటిలో 31 సంస్థలకు గతంలో చేసిన కేటాయింపులు కొనసాగించాలని నిర్ణయించామన్నారు. మరో 2 సంస్థలకు గతంలో ఇచ్చిన చోట కాకుండా మరో చోట కేటాయింపులు చేస్తూ సబ్ కమిటీ నిర్ణయం తీసుకుందన్నారు. 13 సంస్థలకు వివిధ కారణాలతో భూ కేటాయింపులు రద్దుకు సబ్ కమిటీ అంగీకారం తెలిపిందని మంత్రి నారాయణ వెల్లడించారు.
16 సంస్థల భూములకు లొకేషన్, ఎక్స్ టెన్షన్ మార్పులు చేసినట్లు మంత్రి నారాయణ పేర్కొన్నారు. గత వైసీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు మంత్రి నారాయణ. గత ప్రభుత్వం కక్ష సాధింపుతో రాజధాని విషయంలో మూడు ముక్కలాట ఆడిందని మంత్రి నారాయణ ధ్వజమెత్తారు.
Also Read : మొన్న వంశీ, నిన్న పోసాని.. నెక్ట్స్ ఆ మాజీమంత్రి కూడా అరెస్ట్‌కు సిద్ధం కావాల్సిందేనా? వరుస కేసులు తప్పవా?