రాజధానిపై తేల్చేసిన కేంద్రం : టీడీపీ నెక్ట్స్ స్టెప్ ఏంటీ

ఏపీ రాష్ట్రంలో రాజధాని రాజకీయం రసవత్తరంగా మారుతోంది. దీనిపై కేంద్రం కీలక ప్రకటన చేసింది. మూడు రాజధానులంటూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో ఏపీ రాజకీయాలు మరింత వేడెక్కాయి. వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ప్రధానంగా టీడీపీ సీఎం జగన్ పై తీవ్ర విమర్శలు చేసింది.
రాజధానిలోని 29 గ్రామాల ప్రజలు రోడ్డెక్కారు. నిరసనలతో హోరెత్తించారు. కానీ ప్రభుత్వం మాత్రం వెనుకంజ వేయలేదు. అమరావతి జేఏసీ పేరిట ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు జరిగాయి. టీడీపీ చీఫ్ చంద్రబాబు జిల్లాల వారీగా పర్యటిస్తూ..జగన్ సర్కార్ పై మాటలు తూటాలు పేల్చారు. రాజధాని అంశం తమ పరిధిలో కాదని కేంద్రం తేల్చిచెప్పిందని, ఇది టీడీపీ సహా విపక్షాలకు చెంపపెట్టులాంటిదంటూ..వైసీపీ చెబుతోంది.
మూడు రాజధానులపై జీఎన్ రావు, బోస్టన్ కమిటీలు ఏర్పాటు చేసింది వైసీపీ ప్రభుత్వం. అనంతరం దీనిపై హై పవర్ కమిటీ కూడా ఏర్పాటు చేసింది. సీఎం జగన్ చెప్పిందే..కమిటీలు వేశాయని, మూడు రాజధానులకు అనుకూలంగా కమిటీ నివేదికలు చెప్పిందంటూ..బాబు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ క్రమంలో..ప్రత్యేకంగా అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాయి. మూడు రాజధానులకు అనుకూలంగా అసెంబ్లీ తీర్మానం చేసింది.
దీనిని కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. అయితే..కేంద్రం అనుకూలంగా ఉంటుందా ? దీనిని వ్యతిరేకిస్తుందా ? అనే హాట్ హాట్ చర్చలు కూడా జరిగాయి. లోక్ సభ, రాజ్యసభలు తీర్మానానికి ఆమోదం తెలిపిన అనంతరం..రాష్ట్రపతి గ్రీన్ సిగ్నల్ ఇస్తే..మూడు రాజధానులు అధికారికంగా నిర్ధారణ అవుతుంది. తాజాగా కేంద్రం తీసుకున్న నిర్ణయంతో..తీర్మానానికి పచ్చజెండా ఊపుతుందా ? లేదా ? అనే ఉత్కంఠ నెలకొంది. మరి టీడీపీ ముందునుంచి చెబుతున్నట్లుగానే…ముందుకు వెళుతుందా ? లేదా ? అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది.
Read More : Delhi Assembly Election 2020: ఢిల్లీ అంటే బీజేపీకి