Fake Votes : దొంగ ఓట్ల వ్యవహారంపై స్పందించిన ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి
దొంగ ఓట్ల వివాదం మధ్య తిరుపతి బై పోల్ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు.

Ap Chief Electoral Officer Responds On Fake Votes
AP Chief Electoral Officer responds on fake votes : దొంగ ఓట్ల వివాదం మధ్య తిరుపతి బై పోల్ నడుస్తోంది. తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ ప్రధాన ఎన్నికల అధికారి విజయానంద్ స్పందించారు. నకిలీ ఓట్లు వేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చిత్తూరు, నెల్లూరు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు, రిటర్నింగ్ అధికారులకు ఆదేశించారు సీఈవో విజయానంద్. తిరుపతి ఉప ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. ప్రశాంత వాతావరణం మధ్య పోలింగ్ నిర్వహించాలని విజయానంద్ ఆదేశించారు.
తిరుపతిలో ఉప ఎన్నికల వేళ రాజకీయ పార్టీల దొంగ ఓట్ల ఫైటింగ్ కొనసాగుతోంది. దొంగ ఓట్ల వ్యవహారంపై పార్టీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. వైసీపీ, టీడీపీ, బీజేపీ నేతలు పరస్పర విమర్శలు చేసుకుంటున్నారు. వైసీపీ నేతలే దొంగ ఓట్లు వేయిస్తున్నారంటున్న టీడీపీ ఆరోపిస్తుంటే… తెలుగుదేశం పార్టీ నేతలు బస్సుల్లోని ప్రయాణికులను భయపెడుతున్నారని వైసీపీ అంటోంది. ఇక దొంగ ఓట్లు వేస్తే లక్ష కాదు.. రెండు లక్షల మెజార్టీ వస్తుందని బీజేపీ అంటోంది.
మరోవైపు పుంగనూర్ వీరప్పన్ అని ట్వీట్ చేసిన లోకేశ్‌పై మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను వీరప్పన్ అంటూ ట్వీట్ చేయడానికి లోకేశ్‌కు ఎంతధైర్యమని పెద్దిరెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబూ.. లోకేశ్‌ను అదుపులో పెట్టుకోమని హెచ్చరించారు. బీజేపీ అభ్యర్థి రత్నప్రభ.. దొంగ ఓటర్లను పోలీసులకు అప్పగించారు.