AP CID : ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేశామంటే
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయల్సి వచ్చిందో..తదితర కారణాలను ఏపీ సీఐడీ వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది.

Ycp Mp
YSRCP MP : వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును ఎందుకు అరెస్టు చేయల్సి వచ్చిందో..తదితర కారణాలను ఏపీ సీఐడీ వెల్లడించింది. ఈ మేరకు ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఎంపీ రఘురామకృష్ణంరాజును హైదరాబాద్‌లో అరెస్టు చేయడం జరిగిందని, వర్గాలు, కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా వ్యాఖ్యలు చేశారని, ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారని తెలిపింది.
సామాజిక మాధ్యమాల్లో ప్రభుత్వంపై అనుచిత వ్యాఖ్యలు కూడా చేశారని, మత విధ్వేషాలు రెచ్చగొట్టేలా వ్యవహరించారని ఏపీ సీఐడీ అధికారులు తెలిపారు. రఘురామపై ఐపీసీ 124ఏ, 153ఏ, 505 ఆర్/డబ్ల్యూ, 120బీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపింది. మరోవైపు…రఘురామకృష్ణంరాజు అరెస్టుపై ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టు మెట్లు ఎక్కనున్నట్లు సమాచారం.
వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజును శుక్రవారం ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన బర్త్ డే రోజునే అరెస్టు చేయడం గమనార్హం. హైదరాబాద్ నుంచి ఏపీకి తరలించారు. ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కల్గించేలా వ్యాఖ్యలు చేసినందుకుగాను పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు చేశారు.
అరెస్ట్‌కు కారణాలు కూడా చెప్పకుండా.. కోర్టులో చూసుకోండంటూ సీఐడీ అధికారులు అన్నారని ఎంపీ రఘురామకృష్ణంరాజు కుమారుడు భరత్ చెప్పారు. తండ్రిని ఎక్కడికి తీసుకెళ్లారో కూడా తెలియదు. అధికారం చేతిలో ఉందని ఏమైనా చేస్తారా? అంటూ ప్రశ్నించారు. ఒక ఎంపీని, ఒక హార్ట్ పేషెంట్‌ని ఏ మాత్రం సమాచారం ఇవ్వకుండా ఎలా తీసుకుని వెళ్లారని ప్రశ్నించారు.
Read More : Uttar Pradesh : కారు కొనేందుకు మూడు నెలల కొడుకును అమ్మేశారు