ఢిల్లీలో బిజీ బిజీగా చంద్రబాబు : కేజ్రీవాల్ తో భేటీ
ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు.
ఢిల్లీ : ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఢిల్లీలో బిజీ బిజీగా గడుపుతున్నారు. మధ్యాహ్నం ఢిల్లీకి వెళ్లిన చంద్రబాబు.. ఎన్డీయేతరపక్షాలు సేవ్ నేషన్.. సేవ్ డెమొక్రసీ సమావేశంలో పాల్గొన్నారు. ఆ తర్వాత… టీడీపీ ఎంపీలతో భేటీ అయ్యారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఎంపీలకు దీశానిర్దేశం చేశారు. ఆ తర్వాత.. సీఈసీ సునీల్ అరోరాను కలిసారు చంద్రబాబు. అరగంటకుపైగా జరిగిన సమావేశంలో… ఈవీఎంల పనితీరులు, లోక్ సభ ఎన్నికల నిర్వహణపై చర్చించారు. అక్కడి నుంచి నేరుగా ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. రాష్ట్రాలపై కేంద్రం అనుసరిస్తున్న వైఖరిపై కేజ్రీవాల్ తో చర్చించారు.