CM Jagan Meeting Union Minister RK Singh : కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ తో సీఎం జగన్ భేటీ..తెలంగాణ నుంచి రావాల్సిన రూ.6 వేల కోట్ల విద్యుత్ బకాయిలపై చర్చ
ఏపీ సీఎం జగన్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. సుమారు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశంపై చర్చించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలపై ఆర్కే సింగ్‌కు వివరించారు.

CM Jagan Meeting Union Minister RK Singh
CM Jagan Meeting Union Minister RK Singh : ఏపీ సీఎం జగన్ కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్‌ను కలిశారు. సుమారు అరగంట పాటు ఆయనతో భేటీ అయ్యారు. తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన బకాయిల అంశంపై చర్చించారు. తెలంగాణ నుంచి ఏపీకి రావాల్సిన ఆరు వేల కోట్ల విద్యుత్ బకాయిలపై ఆర్కే సింగ్‌కు వివరించారు. తెలంగాణ పెద్దఎత్తున ఏపీకి బకాయిలు చెల్లించాల్సిన ఉందని.. బకాయిల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
దీనిపై స్పందించిన ఆర్కే సింగ్.. జగన్ లేవనెత్తిన సమస్యలను పరష్కరిస్తామని హామీ ఇచ్చారు. ప్రస్తుతం ఈ విషయం సోలిసిటర్ జనరల్ వద్ద ఉందని.. త్వరలో దీనిపై నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చారు. బకాయిలు చెల్లించని డిస్ట్రిబ్యూషన్ కంపెనీలకు 75 రోజుల గడువు ఇస్తున్నామని.. ఆలోపు బకాయిలు చెల్లించాలని.. లేనిపక్షంలో విద్యుత్ కొనుగోలు చేసే అవకాశాన్ని కోల్పోతారని ఆర్కే సింగ్ స్పష్టం చేశారు.
Delhi : ప్రధాని మోడీతో ముగిసిన సీఎం జగన్ భేటీ .. కీలక అంశాలపై చర్చ
అంతకు ముందు ప్రధాని నరేంద్ర మోదీతో సీఎం జగన్ భేటీ అయ్యారు. విభజన చట్టం హామీలు, ఏపీ అభివృద్ధికి సహకరించాలని ప్రధాని మోదీకి సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. రెవెన్యూ లోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టు నిధులు విడుదల చేయడంతో పాటు.. పెండింగ్ నిధులను విడుదల చేయాలని సీఎం జగన్ రిక్వెస్ట్ చేశారు.
అటు.. పోలవరం నిర్వాసితులకు పునరావాస ప్యాకేజీ త్వరగా ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. రాష్ట్రంలో కొత్త మెడికల్ కాలేజీల ఏర్పాటుకు ఆర్థిక సాయం చేయాలని.. భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు క్లియరెన్స్ ఇవ్వాలని సీఎం జగన్ కోరారు. ప్రధానితో భేటీ తర్వాత రాష్ట్రపతి ద్రౌపదిముర్ముతోనూ జగన్ సమావేశమయ్యారు.