పోలవరాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదే : జగన్ లేఖ

  • Published By: sreehari ,Published On : October 31, 2020 / 03:45 PM IST
పోలవరాన్ని పూర్తిచేయాల్సిన బాధ్యత కేంద్రానిదే : జగన్ లేఖ

Updated On : October 31, 2020 / 3:54 PM IST

AP CM Jagan : పోలవరం ప్రాజెక్టుపై ప్రధాని నరేంద్ర మోడీకి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. ప్రధానితో పాటు ఆర్థిక, జలశక్తి మంత్రులకు కూడా ఆయన లేఖ రాశారు.



జాతీయ ప్రాజెక్టు పోలవరాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్రానిదేనని జగన్ లేఖలో పేర్కొన్నారు.

పోలవరం ఏపీకి జీవనాడి లాంటిదన్నారు. ప్రాజెక్టు పనులతో పాటు నిర్వాసితుల సమస్యలపై కేంద్రం దృష్టి పెట్టాలని కోరారు.



నిధుల విడుదల జాప్యం, పనులు ఆలస్యంతో అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉందని జగన్ ఆందోళన వ్యక్తం చేశారు.