AP Covid-19 Live Updates: ఏపీలో తగ్గిన కరోనా.. 9,836 మంది రికవరీ

AP Covid-19 Live Updates : ఏపీలో కరోనా కేసులు భారీగా తగ్గుతున్నాయి. ఏపీలో పాజిటివ్ రేటు 12 నుంచి 8.3శాతానికి తగ్గింది. కరోనా కేసులు క్రమంగా తగ్గుతుండగా రికవరీ కేసుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది.
గడిచిన 24 గంటల్లో 9,836 మంది కోవిడ్ నుంచి పూర్తిగా కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులు అయ్యారు. రాష్ట్రంలో గత 24 గంటల్లో 68, 429 కరోనా శాంపిల్స్ పరీక్షించగా.. 6,190 మందికి కరోనా పాజిటివ్ ఫలితాలు వచ్చాయి. మరో 35 మంది మృతిచెందారు.
ఇప్పటివరకూ రాష్ట్రంలో 57,34,752 శాంపిల్స్ పరీక్షించారు. ఏపీలో కరోనా కేసులు 6,87,351కు చేరాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో 5,780 మంది మృతి చెందారు. ప్రస్తుతం ఏపీలో 59,435 యాక్టివ్ కేసులు ఉండగా.. మొత్తంగా 6,22,136 మంది డిశ్చార్జ్ అయ్యారు.
ఏపీలో పలు జిల్లాల్లో కోవిడ్ వల్ల ప్రకాశం జిల్లాలో 8 మంది, చిత్తూరులో ఆరుగురు, అనంతపూర్ లో నలుగురు, తూర్పు గోదావరిలో నలుగురు, గుంటూరులో నలుగురు, విశాఖపట్నంలో ముగ్గురు, నెల్లూరులో ఇద్దరు, పశ్చిమ గోదావరిలో ఇద్దరు, శ్రీకాకుళంలో ఇద్దరు మరణించారు.