వాలంటీర్లను జగన్ మోసం చేశారు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

ఇదొక సాంకేతిక సమస్య అని పవన్ కల్యాణ్ అన్నారు.

వాలంటీర్లను జగన్ మోసం చేశారు- పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Kalyan

Updated On : November 7, 2024 / 9:42 PM IST

Pawan Kalyan : వాలంటీర్ల వ్యవస్థపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వం గ్రామ వాలంటీర్లను దారుణంగా మోసం చేసిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు. జగన్ సర్కార్ వాలంటీర్లను మోసం చేసి ఉద్యోగం ఇచ్చిందన్నారు. వాలంటీర్లకు సంబంధించి ఎలా జీవో లేదని ఆయన తేల్చి చెప్పారు. వాలంటీర్లకు మేలు చేయాలనే ఆలోచనతోనే కూటమి ప్రభుత్వం ఉందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. వాళ్లు ఉద్యోగంలో ఉంటే రద్దు చేయొచ్చు.. కానీ, అసలు వ్యవస్థలోనే లేరని పవన్ కల్యాణ్ అన్నారు. ఇదొక సాంకేతిక సమస్య అని పవన్ కల్యాణ్ అన్నారు.

సర్పంచులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సమావేశం అయ్యారు. ఇందులో పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కూడా పాల్గొన్నారు. డిప్యూటీ సీఎం పవన్ తో జరిగిన మీటింగ్ లో సర్పంచ్ లు మొత్తం 16 అంశాలను ఆయన ముందు ఉంచారు. రాజధానిలో భవన నిర్మాణం కోసం రెండు ఎకరాల స్థలం అడిగారు సర్పంచులు. వారి విజ్ఞప్తిపై పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారు.

అటు త్వరలోనే గ్రామ పంచాయితీల ఖాతాల్లో నిధులు జమ అవుతాయని స్పష్టం చేశారు. ప్రభుత్వం నిధులు ఆపడం లేదన్న పవన్.. 15 ఫైనాన్స్ డబ్బులు త్వరలో అకౌంట్ లో జమ అవుతాయని చెప్పారు. గ్రామీణాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కట్టుబడి ఉన్నాయని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం పంచాయితీలకు ఇచ్చిన రూ.35వేల కోట్లను గత ప్రభుత్వం దారి మళ్లించిందని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

గత పాలకులు చేసిన నిర్ణయాలకు జవాబుదారితనం లేకుండా పోయిందన్నారు. అసలు ఆ నిధులను ఎటు మళ్లించారో కూడా లెక్కలు తేలడం లేదని చెప్పారు. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక చర్చ జరిగేలా చూస్తానన్నారు పవన్ కల్యాణ్.

 

 

Also Read : పవర్‌లో ఉన్నా ఎందుకీ ఆవేశం? అసలు పవన్ కల్యాణ్ వ్యూహం ఏంటి..