Ap Rains: ఏపీకి రెడ్ అలర్ట్.. పిడుగులు, ఈదురుగాలులతో భారీ వర్షం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
ఆంధ్రప్రదేశ్(Ap Rains)లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు.
Ap disaster management authority issues red orange and yellow alert for rain
- మూడు గంటల్లో వర్షాల హెచ్చరిక
- పలు జిల్లాలకు రెడ్ అలర్ట్
- పిడుగుల ముప్పుపై అప్రమత్తం కావాలి
Ap Rains: ఆంధ్రప్రదేశ్లో మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ సూచించారు. రాబోయే మూడు గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు (Ap Rains)కురిసే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. వాతావరణ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షిస్తున్న అధికారులు ప్రజలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభావిత జిల్లాలకు రెడ్, ఆరెంజ్, ఎల్లో అలర్ట్లు జారీ చేశారు. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలు అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని సూచించారు. రైతులు, మత్స్యకారులు, బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే వారు ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని అధికారులు కోరుతున్నారు.
