AP Education Minister: పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ఆదిమూలం సురేష్

ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖామంత్రి ఆదిమూలం సురేష్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన 10, ఇంటర్మీడియట్ పరీక్షలపై స్పందించారు.

AP Education Minister: పరీక్షలపై క్లారిటీ ఇచ్చిన ఆదిమూలం సురేష్

Ap Education Minister

Updated On : June 11, 2021 / 6:09 PM IST

AP Education Minister: ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ బాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్బంగా ఆయన 10, ఇంటర్మీడియట్ పరీక్షలపై స్పందించారు. పది, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ కోసం ఇసీని నియమించామని తెలిపారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకొనే పరీక్షలపై నిర్ణయం తీసుంటామని అన్నారు.

పరీక్షల నిర్వహణపై గురువారం అధికారులతో సమావేశమైనట్లు తెలిపారు. ప్రస్తుతం అయితే పరీక్షలు నిర్వహించే పరిస్థితి లేదని అన్నారు. విద్యార్థుల ఆరోగ్య భద్రతకు ఎటువంటి ఇబ్బంది లేదు అన్నప్పుడు పరీక్షలు నిర్వహిస్తామని విద్యార్థుల తల్లిదండ్రులు భయపడాల్సిన పనిలేదని, పరిస్థితిలు అనుకూలించిన తర్వాతే పరీక్షలు పెడతామని తెలిపారు.

కొంతమంది పరీక్షలు రద్దు చెయ్యాలంటూ రాద్ధాంతం చేస్తున్నారు.. కానీ ఓ తండ్రిగా పరీక్షల నిర్వహణకే మద్దతిస్తానని తెలిపారు సురేష్. ఇక ఇదే సమయంలో ప్రైవేట్ పాఠశాలలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పరీక్షలు రద్దయ్యాయని కాలేజీలు అడ్మిషన్లు తీసుకుంటే కఠినంగా వ్యవరిస్తామని తెలిపారు. ఒక్క ఫిర్యాదు వచ్చినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. దీనిపై టాస్క్ ఫోర్స్, విజిలెన్స్ టీమ్స్ ను ఏర్పాటు చేస్తామని వివరించారు.