జగనన్న చెప్పాడంటే..చేస్తాడంతే, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు – ఆదిమూలపు సురేష్

  • Published By: madhu ,Published On : October 10, 2020 / 11:34 AM IST
జగనన్న చెప్పాడంటే..చేస్తాడంతే, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు – ఆదిమూలపు సురేష్

Updated On : October 10, 2020 / 12:03 PM IST

AP Education Minister : జగనన్న చెప్పాడంటే..చేస్తాడంతే..నిధులు ఎవరిచ్చినా..సరే ఇవ్వకపోయినా..సరే..విద్యార్థులకు ఉపయోగపడే విధంగా సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తోందని ఏపీ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. 2020, అక్టోబర్ 10వ తేదీ శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు.



గతంలో నిర్వహించిన పాదయాత్రలో జగన్ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించారని తెలిపారు. అధికారంలోకి వచ్చాక పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని, జగనన్న విద్యా కానుక పథకంపై ప్రతిపక్షం విమర్శలు చేయడం సరికాదన్నారు. జగనన్న గోరుముద్ద, మధ్యాహ్న భోజన పథకాన్ని చూడాలని, విద్యా వ్యవస్థలో సమూలమైన మార్పులు చేస్తున్నారని తెలిపారు.



వాస్తవాలు రాయాలని కొన్ని పత్రికలకు సూచించారాయన. ఆంధ్రప్రదేశ్ ను విద్యాంధ్రప్రదేశ్ గా మార్చడానికి సీఎం జగన్ కృషి చేస్తున్నారని చెప్పుకొచ్చారు.
జగనన్న విద్యా కానుక ఎంతో గొప్పదని, దీనిపై తెలుగు తమ్ముళ్లు చేస్తున్న విమర్శలు సరైంది కాదన్నారు.



యూనిఫాం కుట్టించుకొనేందుకు తల్లుల అకౌంట్లలో డబ్బులు వేయడం జరుగుతోందని, ఒకటి నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు కిట్ అందచేస్తున్నామని, బ్యాగుపై జగనన్న విద్యా కానుక అని రాయడం జరిగిందన్నారు. దీనికి సంబంధించి నిధులను ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. యూనిఫాం కోసం రూ. 100 కోట్లను కేంద్రం కేటాయించిందని, మిగతావన్నీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయన్నారు మంత్రి ఆదిమూలపు సురేష్.