ఆ విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు : ఆర్టీసీ బస్సుల్లో ఇళ్లకు చేరుస్తాం – ఆదిమూలపు సురేష్

జలుబు, దగ్గు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక రూంలో పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, హాస్టల్ విద్యార్థులను దగ్గరుండి ఆర్టీసీ అధికారులతో మాట్లాడి వారిని బస్సుల్లో ఇళ్లకు చేరుస్తామని ఏపీ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారరు. 2020, మార్చి 19వ తేదీ ఆయన మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల విషయంలో ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఆయన మీడియాకు వివరించారు.
See Also | బీ అలర్ట్: మాస్కులు, గ్లోవ్స్ వేసుకుంటే సరిపోదు..
ఇంటర్, పదో తరగతి పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని స్పష్టం చేశారు. మార్చి 31 వరకు విద్యా సంస్థలకు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. అన్ని పాఠశాలలు, కాలేజీలు, విశ్వవిద్యాలయాలు, కోచింగ్ సెంటర్లు తప్పకుండా మూసివేయాలని ఆదేశించారు. నిబంధనలు పాటించకపోతే..కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. విద్యాశాఖ పరిధిలోకి వచ్చే..ప్రైవేటు యూనివర్సిటీలు, డీమ్డ్ యూనివర్సిటీలతో పాటు కోచింగ్ సెంటర్లు ఉత్తర్వులు పాటించాలన్నారు. అవసరమని అనుకుంటే..మాత్రం ఆన్ లైన్ ద్వారా క్లాసులు తీసుకోవచ్చన్నారు.
Read More : కరీంనగర్‌కు 100 వైద్య బృందాలు : ఆ 8 మంది ఎక్కడ తిరిగారు ? ఎవరిని కలిశారు ?