ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఈసీ సరికొత్త ప్రయోగం

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా సరికొత్త ప్రయోగానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది.

ఏపీ ఎన్నికల ఫలితాల్లో ఈసీ సరికొత్త ప్రయోగం

Updated On : June 4, 2024 / 9:41 AM IST

AP Elections Results 2024: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ సందర్భంగా సరికొత్త ప్రయోగానికి ఎన్నికల సంఘం శ్రీకారం చుట్టింది. కౌంటింగ్ కు సంబంధించి ఏపీ సెక్రటేరియట్ లో ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మీడియా సెల్ దగ్గర ఎల్ఈడి టీవీల్లో ఎన్నికల ఫలితాలను ఎప్పటికప్పుడు డిస్ ప్లే చేస్తోంది. రాష్ట్రంలో ఉన్న ప్రతి అభ్యర్థి కౌంటింగ్ కు సంబంధించిన ఫలితాలు రౌండ్లతో సహా అధికారికంగా ప్రకటిస్తోంది. ఆధిక్యం వివరాలను కూడా అధికారికంగా ఎప్పటికప్పుడు అందిస్తోంది.

మరోవైపు తమ వెబ్ సైట్ లోనూ ఫలితాలను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తోంది ఎన్నికల సంఘం. ఎన్నికల ఫలితాల కోసం results.eci.gov.in వెబ్ సైట్ చూడొచ్చు. దీని ద్వారా ఎన్నికల ఫలితాలను ఎవరైనా వీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది.

విశాఖపట్నంలో 1350 సర్వీస్ ఓట్లు
విశాఖపట్నం లోక్ సభ స్థానానికి 1350 సర్వీస్ ఓట్లు పోలయ్యాయి. ఆరు స్కానర్లు ద్వారా సిబ్బంది స్కాన్ చేస్తున్నారు. సర్వీస్ ఓట్లలో 13ఏ లు పెట్టకుండా  కొంతమంది ఓటర్లు పోస్ట్ చేశారు.

ప్రత్యేక విమానంలో పవన్ కళ్యాణ్
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఈ ఉదయం 10:30 గంట‌ల‌కు గన్నవరం ఎయిర్‌పోర్ట్‌కి రానున్నారు.