Sajjala : నారాయణ అరెస్టుపై సజ్జల సంచలన వ్యాఖ్యలు
పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ మొదలైందే నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి అని పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసు తీగలాగితే వాళ్ల దగ్గరే డొంక కదిలిందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు.

Sajjala (1) (1)
Sajjala Ramakrishnareddy : టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ అరెస్టుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. నారాయణ విద్యా సంస్థల పర్యవేక్షణలోనే మాల్ ప్రాక్టీస్ జరిగిందని తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులను పీడించి వేల కోట్లు సంపాదించారని ఆరోపించారు. ఆ డబ్బుతోనే నారాయణ రాజకీయాల్లోకి వచ్చారని తెలిపారు.
అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వాళ్లను చూసీ చూడనట్లు వదిలేసిందన్నారు. పేపర్ మాల్ ప్రాక్టీస్ కల్చర్ మొదలైందే నారాయణ, చైతన్య విద్యా సంస్థల నుంచి అని పేర్కొన్నారు. మాల్ ప్రాక్టీస్ కేసు తీగలాగితే వాళ్ల దగ్గరే డొంక కదిలిందన్నారు. చట్టం ఎవరికీ చుట్టం కాదన్నారు. నిజాలు విచారణలో బయటకు వస్తాయని తెలిపారు. మాల్ ప్రాక్టీస్ ను ఆర్గనైజ్డ్ క్రైమ్ గా మార్చారని పేర్కొన్నారు.
Narayana Arrest : నారాయణ అరెస్టును ధృవీకరించిన చిత్తూరు పోలీసులు
తమ ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడంతోనే తప్పు బయటపడిందన్నారు. అధికారులకు స్వేచ్ఛ ఇవ్వడం వల్లే నారాయణ దొరికారని తెలిపారు. టీడీపీ ఆగడాలు భరించలేకే జనం ఆ పార్టీకి బుద్ధి చెప్పారని పేర్కొన్నారు. నారాయణను ప్రభుత్వం వేధిస్తోందని టీడీపీ నేతలు చెప్పడం సిగ్గు చేటన్నారు. నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణను ఏపీ సీఐడీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసింది.
అయితే నారాయణ అరెస్టును చిత్తూరు పోలీసులు ధృవీకరించారు. టెన్త్ ఎగ్జామ్స్ మాల్ ప్రాక్టీస్ కేసులో ఆయన్ను అరెస్టు చేసినట్లు ఎస్పీ కార్యాలయం తెలిపింది. ఉదయాన్నే హైదరాబాద్ లో నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు నారాయణను హైదరాబాద్ నుంచి చిత్తూరు తీసుకెళ్తున్నారు. ప్రశ్నపత్రాల మాల్ ప్రాక్టీస్ కేసులో ఇప్పటికే 60 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు.
TDP Leader Narayana : ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసు : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్..!
హైదరాబాద్‌లో కొండాపూర్‌లోని ఆయన నివాసంలో మంగళవారం (మే10,2022) పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రశ్నాపత్రాల లీకేజ్ వ్యవహారంలో ఆయనను సీఐడీ అదుపులోకి తీసుకున్నారు. పదవ తరగతి పరీక్ష పేపర్ లీకేజ్ కేసుతోపాటు, అమరావతి రాజధాని భూముల CRDA కేసులో కూడా నారాయణ పై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రెండు కేసుల్లో విచారణ కోసం నారాయణను ఏపీ సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
టెన్త్ ప్రశ్నాపత్రం లీకేజీతో నారాయణ విద్యాసంస్థలకు సంబంధం ఉందన్న ఆరోపణలపై నారాయణను ఏపీ సీఐడీ అదుపులోకి తీసుకుంది. టెన్త్ ప్రశ్నా పత్రాల లీకేజ్ కేసులో నారాయణ విద్యాసంస్థలపై కేసు నమోదు అయింది. చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌తో పాటు కృష్ణాజిల్లా మండవల్లిలో సీఐడీ కేసులు నమోదు చేసింది. చిత్తూరు వన్‌టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్ఐఆర్ నెంబరు 111/2022 కింద కేసు నమోదు చేశారు. కృష్ణాజిల్లా మండవల్లిలో ఈ నెల 2వ తేదీన ఎఫ్‌ఐఆర్ నెంబరు 141/2022 కింద కేసు నమోదు చేశారు.
TDP Leader Narayana: ఏపీ మాజీ మంత్రి నారాయణ అరెస్టును ఖండించిన చంద్రబాబు
ఇప్పటికే చిత్తూరు కేసులో నారాయణ కాలేజీ వైస్ ప్రిన్సిపల్‌ను సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నారాయణతో పాటు ఆయన సతీమణికి కూడా నారాయణ విద్యాసంస్థల్లో కీలక పాత్ర ఉంది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజ్ కేసులో తెల్లవారు జామున హైదరాబాద్‌లో నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాల్ ప్రాక్టీస్ నిరోదక చట్టం 408 ఐపిసి కింద కేసులు నమోదు చేశారు.