AP PRC Protest : పీఆర్సీపై ఉద్యోగ సంఘాల ఐక్య పోరాటం.. ప్రభుత్వ వైఖరిని బట్టి కార్యాచరణ..!
ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. పీఆర్సీ జీవోల రద్దుపై ఆందోళనలను ఉదృతం చేస్తున్నాయి.

Ap Government Employees
AP PRC Protest : ఏపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త పీఆర్సీకి వ్యతిరేకంగా ఉద్యోగ సంఘాలు ఉమ్మడి పోరాటానికి సిద్ధమయ్యాయి. పీఆర్సీ జీవోల రద్దుపై ఆందోళనలను ఉదృతం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఐక్యపోరాటంతో ముందుకు కొనసాగుతూ భవిష్యత్తు కార్యాచరణను సిద్ధం చేస్తున్నాయి. పీఆర్సీ జీవోలను ఉపసంహరించుకుంటున్నట్టుగా ప్రభుత్వం ప్రకటిస్తేనే తాము చర్చలకు వస్తామని ఉద్యోగ సంఘాలు తేల్చిచెప్పేశాయి. పీఆర్సీ జీవోల ప్రకారమే జీతాలు చెల్లించాలని ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను అమలు చేసేది లేది ఇటీవలే ట్రెజరీ ఉద్యోగులు అల్టీమేటం జారీ చేసిన సంగతి తెలిసిందే. ఉద్యోగ సంఘాల వ్యతిరేకతో ఏపీ ప్రభుత్వం ఇరకాటంలో పడింది. పీఆర్సీ రద్దుకు సంబంధించి ప్రభుత్వం ప్రకటన చేయని పక్షంలో ఈ రోజు (జనవరి 21న) సమ్మె నోటీసు ఇస్తామని ఇదివరకే ఏపీ జేఏసీ, ఏపీ జేఏసీ అమరావతి నాయకులు ప్రకటించారు.
ఈ రోజు ఉదయం 11.30 గంటలకు సెక్రటేరేయట్‌లో ఉద్యోగ సంఘాలు సమావేశం కానున్నాయి. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నాయకులు బొప్పరాజు, బండి శ్రీనివాసులు, వెంకట్రామిరెడ్డి, సూర్యనారాయణ పాల్గొని చర్చించనున్నారు. ఏపీ కేబినెట్ భేటీలో పీఆర్సీ జీవీలపై చర్చ జరిగి ఏదైనా ప్రకటన ప్రభుత్వం నుంచి వస్తుందనే ఆశాభావంతో ఉద్యోగ సంఘాలు ఉన్నాయి. పీఆర్సీపై ప్రభుత్వ వైఖరిని బట్టి తమ కార్యాచరణను ఉద్యోగ సంఘాలు ప్రకటించే అవకాశం ఉంది. రాష్ట్ర ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాలు ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి. ప్రభుత్వం దిగిరాకుంటే సమ్మెకు దిగుతామని హెచ్చరిస్తన్నాయి.
సచివాలయంలో సమావేశమై ఉమ్మడి కార్యాచరణ, పోరాటం, విధి, విధానాలు రూపొందిస్తామని ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు ఆయా సంఘాలు తీసుకున్న నిర్ణయాల మేరకు ఆందోళనలు, నిరసలు నిర్వహించామని తెలిపాయి. ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త పీఆర్సీతో నష్టం తప్ప ఎలాంటి ప్రయోజనం లేదని ఉద్యోగ సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోలకు వ్యతిరేకంగా పోరాటం చేయాలని నిర్ణయించుకున్నాయి. పీఆర్సీ సాధించడమే లక్ష్యంగా కలిసి పనిచేస్తామని ఉద్యోగ సంఘాల నేతలు స్పష్టం చేశారు. కొత్త పీర్సీని రద్దు చేసే వరకు వెనక్కి తగ్గేదేలేదని స్పష్టం చేశారు.
Read Also : AP Cabinet : నేడు ఏపీ మంత్రివర్గం సమావేశం.. 32 అంశాలతో కేబినెట్ అజెండా..!