Sankranthi Holidays : ఏపీ విద్యార్థులకు శుభవార్త.. సంక్రాంతి సెలవులు పొడిగింపు.. ఎన్ని రోజులంటే..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది.

Sankranthi Holidays extended
Sankranthi Holidays extended : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విద్యార్థులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మరో మూడు రోజుల పాటు సంక్రాంతి సెలవులను ప్రభుత్వం పొడిగించింది. దీంతో పాఠశాలలు జనవరి 22 సోమవారం రోజున పునఃప్రారంభం కానున్నాయి.
వాస్తవానికి మొదట సంక్రాంతి సెలవులు జనవరి 18 గురువారం వరకు మాత్రమే ఇచ్చారు. శుక్రవారం నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకు మరో మూడు రోజుల పాటు సెలవుల పొడిగింపు నిర్ణయం తీసుకున్నట్లు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ తెలియజేశారు.
ఎన్నికల వేళ జనసేనలో చేరికల జోష్.. పార్టీలో చేరనున్న మాజీమంత్రి కొణతాల రామకృష్ణ..!