AP Govt Show Cause Notices : ఇంటర్ లో 50 శాతం లోపు ఉత్తీర్ణత… సంచలన నిర్ణయం తీసుకున్న ఏపీ సర్కార్
AP Govt Colleges Show Cause Notice : ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. పలు ఇంటర్ కాలేజీల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ap government issues show cause notices to principals lecturers for pass percentage of less than 50 in govt jr colleges
AP Govt Show Cause Notices : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొన్ని రోజుల క్రితం ప్రకటించిన ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల్లో 50 శాతం కన్నా తక్కువ ఉత్తీర్ణత నమోదైన సబ్జెక్టు లెక్చరర్లు, కాలేజీలపై క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. ఈ క్రమంలో తక్కువ ఉత్తీర్ణత సాధించిన ఆయా సబ్జెక్టుల లెక్చరర్లకు తాజాగా ఏపీ సర్కార్ నోటీసులు జారీ చేసింది. అలానే తక్కువ ఉత్తీర్ణత నమోదైన కాలేజీల ప్రిన్సిపాళ్లకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. వీటికి సంబంధించి ఇంటర్ బోర్డు కార్యదర్శి పి. రంజిత్ బాషా ఆదేశాలు జారీ చేశారు.
Also Read: ఏపీ వాసులకు అదిరిపోయే శుభవార్త చెప్పిన కేంద్రం.. ఎన్నో ఏళ్ల కల సాకారం..
మే 5, 2026న ఇంటర్ బోర్డు కార్యాలయంలో తక్కువ ఉత్తీర్ణత సాధించిన 50 ప్రభుత్వ కాలేజీల ప్రిన్సిపాళ్లతో ప్రత్యేక సమీక్ష నిర్వహించారు. దీనిపై తగిన వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో 50 శాతం లోపు ఉత్తీర్ణత సాధించిన ప్రభుత్వ జూనియర్ కాలేజీల ప్రిన్సిపాళ్లతో డైరెక్టర్ సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా.. సబ్జెక్టులో తక్కువ ఉత్తీర్ణత సాధించిన అతిథి అధ్యాపకులను విధుల నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉత్తీర్ణత శాతం పెంచేలా వచ్చే సంవత్సరానికి సమాధానాలతో కూడిన క్వశ్చన్ బ్యాంకులు అందించాలని అధికారులకు సూచించారు.
