AP Government : న్యూఇయర్ వేళ ఏపీ ప్రజలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. ఇక దర్జాగా ఆ భూములు అమ్ముకోవచ్చు
AP Government : ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా(22-ఏ)లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తాజాగా సంతకం చేశారు.
Minister Anagani Satya Prasad
AP Government : నూతన సంవత్సరంలోకి అడుగుపెట్టిన వేళ ఏపీలోని ప్రజలకు రెవెన్యూ శాఖ న్యూఇయర్ గిఫ్ట్ ఇచ్చింది. ఏపీలోని పలు ప్రాంతాల్లో అర్హత ఉన్నప్పటికీ ప్రభుత్వ రికార్డుల్లో నిషిద్ధ జాబితా(22-ఏ)లో చిక్కుకున్న భూములకు విముక్తి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 22ఏ జాబితా నుంచి కొన్ని రకాల భూములను తొలగిస్తూ రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ తాజాగా సంతకం చేశారు.
Also Read: కొత్త సంవత్సరంలో ఏపీ ప్రజలకు భారీ శుభవార్త.. చార్జీలు తగ్గింపు
గతంలో భూములు రీ-సర్వే నిర్వహించగా.. అర్హత ఉన్న భూములను కూడా 22-ఏ జాబితాలో చేర్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఆ సమస్యను పరిష్కరించి అర్హులైన వారికి న్యాయం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా.. ప్రభుత్వ నిర్ణయం ప్రకారం.. ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుంచి పూర్తిగా తొలగించనున్నారు. ఐదు రకాల భూములను 22ఏ జాబితా నుండి తొలగిస్తూ కొత్త సంవత్సరంలో మంత్రి అనగాని సత్యప్రసాద్ తొలి సంతకం చేశారు. మిగిలిన నాలుగు రకాల భూములపై త్వరలో జీవోఎంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

Minister Anagani Satya Prasad
ఫూర్తి వివరాలు ఇలా..
♦ ప్రైవేట్ భూములను 22ఏ జాబితా నుండి పూర్తిగా తొలగించనున్నారు.
♦ ప్రైవేట్ పట్టా భూములకు ఎవరు దరఖాస్తు చేసుకున్నా అధికారులు సుమోటోగా తొలగించాల్సి ఉంటుంది.
♦ ప్రస్తుత, మాజీ సైనిక ఉద్యోగుల భూములకు సంబంధిత పత్రాలు ఉంటే నిషిద్ద జాబితా నుండి తొలగించాల్సి ఉంటుంది.
♦ స్వాతంత్ర్య సమరయోధుల భూములకు కూడా 22ఏ నుండి తొలగించనున్నారు.
♦ భూ కేటాయింపు కోసం జిల్లా సైనిక సంక్షేమ అధికారి చేసిన సిఫార్సుల రిజిస్టర్ సరిపోతుంది.
♦ 10(1) రిజిస్టర్, అడంగల్స్, ఎస్ఎఫ్ఎ లాంటి రెవెన్యూ రికార్డులు ఉన్నా సరిపోతుంది. ఎసైన్మెంట్ రిజిస్టర్లు, డీఆర్ దస్త్రాలు ఉన్నా చాలని ఆదేశాలు జారీ అయ్యాయి.
♦ రికార్డ్ ఆఫ్ హోల్డింగ్స్, రిజిస్ట్రేషన్ పత్రాల్లో ఏదోకటి సరిపోతుంది.
♦ 8ఏ రిజిస్టర్లు, డికెటీ పట్టాల్లో ఏదైనా ఒకటి ఉన్నా ఒకటే అని ప్రభుత్వం తెలిపింది.
♦ దాదాపు 8 రకాల ప్రతాల్లో ఏ ఒక్కటి ఉన్నా 22ఏ నుండి తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు.
♦ అదనంగా పత్రాలు కావాలని భూ యాజమానులను తిప్పుకోకూడదని స్పష్టం చేశారు.
♦ రైతులకు, భూయాజమానుల హక్కులు రక్షించడమే తమ ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని మంత్రి అనగాని సత్యప్రసాద్ అన్నారు.
