గుడ్ న్యూస్ : ఫించన్ రాని వారి విషయంలో ఏపీ ప్రభుత్వం నయా ప్లాన్

  • Published By: madhu ,Published On : February 7, 2020 / 02:36 PM IST
గుడ్ న్యూస్ : ఫించన్ రాని వారి విషయంలో ఏపీ ప్రభుత్వం నయా ప్లాన్

Updated On : February 7, 2020 / 2:36 PM IST

ఫించన్ దారులు ఎలాంటి ఆందోళన చెందవద్దని..అర్హులందరికీ పెన్షన్లు ఇవ్వాలన్నదే లక్ష్యమని..ఏపీ ప్రభుత్వం వెల్లడిస్తోంది. 4.80 లక్షల పెన్షన్ల విషయంలో ప్రభుత్వం కొత్త ప్లాన్ వేస్తోంది. అర్హులకు లబ్దిదారుల జాబితాలో చోటు దక్కకపోయినా..ఈసారి జరిగే రీ వెరిఫికేషన్‌లో న్యాయం జరుగుతుందని ప్రభుత్వం హామీనిచ్చింది. ఈ మేరకు శుక్రవారం(ఫిబ్రవరి-7,2020) గోపాల కృష్ణ ద్వివేదీ ట్వీట్ చేశారు.

అర్హతలు పూర్తిగా నిర్ధారణ కాని 4.80 లక్షల ఫించన్ దారులకు వారి ఇంటి వద్దకే ఎంపీడీవో లేదా మున్సిపల్ కమిషనర్ వచ్చి వారం రోజుల లోపు అర్హతలను పరిశీలన చేస్తారని వెల్లడించింది. సర్వేలో అర్హులైనట్లు తేలితే..ఫిబ్రవరి ఫించన్‌తో పాటు మార్చి ఫించన్‌తో కలిపి లబ్దిదారుల ఇంటి వద్దకే గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ ద్వారా అందచేస్తామని స్పష్టం చేసింది. 

* నవశకం సర్వేలో భాగంగా 54.68 లక్షల మందికి ఒకటో తారీఖునే ఫించన్ దారుల ఇంటి వద్దకే గ్రామ / వార్డ్ వాలంటీర్లచే రూ. 1, 320 కోట్లు ఫించన్ పంపిణీ చేయడం జరుగుతుందని ప్రభుత్వం ఇప్పటికే వెల్లడించిన విషయం తెలిసిందే. 
* 31 వేల 672 మంది దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు ఫించన్ మొత్తాన్ని రూ. 3 వేలు, రూ. 5 వేలు, రూ. 10 వేల వరకు ఫిబ్రవరి నెలలో అందించడం జరిగింది. 
* మార్గదర్శకాలను సరళతరం చేసినట్లు ప్రభుత్వం పేర్కొంది. 

* వయో పరిమితిని 65 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాలకు తగ్గింపు.
* గత ప్రభుత్వం ఇస్తున్న ఫించన్ మొత్తం రూ. 1000 నుంచి రూ. 2 వేల 250లకు పెంచారు. 
* ప్రతి ఏటా రూ. 250 ల చొప్పున రూ. 3 వేలకు ఫించన్ మొత్తాన్ని పెంచారు. 

* నిరుపేద కుటుంబానికి 3 ఎకరాల లోపు మాగాణి లేదా 10 ఎకరాల లోపు మెట్టా లేదా రెండూ కలిపి 10 ఎకరాల లోపు ఉన్న వారికి కూడా ఫించన్. 
* దివ్యాంగులకు వారి అంగవైకల్య శాతంతో సంబంధం లేకుండా 40 శాతం పైబడిన వారందరికీ ఫించన్.
* కుటుంబ ఆదాయ పరిమితి గ్రామీణ ప్రాంతాల్లో నెలకు రూ. 10 వేలు మరియు పట్టణ ప్రాంతాల్లో రూ. 12 వేలు పెంచారు. 

* టాక్సీ, ట్రాక్టర్, ఆటోలు నాలుగు చక్రాల వాహన పరిమితి నుంచి మినహాయింపు. 
* మున్సిపల్ ఏరియా పరిధిలో నివాస 1000 చదరపు అడగులు వరకు మినహాయింపు. 
* కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ ఉద్యోగి, పెన్షన్ దారు గాని అయి ఉండరాదు.