Power Loom Workers : నేతన్నలకు ఏపీ సర్కార్ భారీ ఊరట.. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ!

Power Loom Workers : పవర్ లూమ్ చేనేత కార్మికులకు భారీ ఊరట కలిగింది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీని కల్పిస్తు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

Power Loom Workers : నేతన్నలకు ఏపీ సర్కార్ భారీ ఊరట.. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీ!

AP Govt Gives Subsidy to Power Loom Workers on Electricity

Power Loom Workers : చేనేత కార్మికులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పవర్ లూమ్ చేనేతలకు భారీ ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంది. పవర్ లూమ్‌లకు విద్యుత్ సబ్సిడీని అందిస్తున్నట్టు ప్రకటించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యూనిట్‌కు 94 పైసలు రాయితీని అందిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, ఎలక్ట్రిసిటీ డ్యూటీకి రూ.1 నుంచి 6 పైసలకి తగ్గించింది. పవర్ లూమ్స్ నిర్వహించే చేనేతలకు మేలు చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దాంతో నేతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also : కరెంటోళ్లు జాగ్రత్త.. విద్యుత్ శాఖ అధికారులకు సీఎం రేవంత్ సీరియస్ వార్నింగ్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రవ్యాప్తంగా పవర్ లూమ్స్ ద్వారా చేనేతలు చీరలను తయారు చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం నుంచి రాయితీలు కేవలం హ్యాండ్ లూమ్స్ వారికి మాత్రమే అందుతున్నాయని, తమను ఎవరూ పట్టించుకోవడం లేదంటూ నేతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. తమకు విద్యుత్ రాయితీ కల్పించాలని ప్రభుత్వాన్ని కొంతకాలంగా వేడుకుంటున్నారు.

చేనేతల అభ్యర్థనపై స్పందించిన ఏపీ ప్రభుత్వం యూనిట్‌కు 94 పైసలు రాయితీ కల్పిస్తూ నిర్ణయం తీసుకుంది. పవర్ లూమ్ యంత్రాలపై వచ్చే విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీ కల్పించాలని గతకొంతకాలంగా పవర్ లూమ్ చేనేతలు కోరుతున్నారు. ఈ క్రమంలోనే నేతన్నలకు భారీ ఊరట కల్గిస్తూ ఏపీ ప్రభుత్వం సబ్సిడీని అందిస్తున్నట్టు ప్రకటించింది.

Read Also : Telangana Congress Lok Sabha Candidates : లోక్‌సభ ఎన్నికలు.. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే?