Nara Lokesh : బెట్టింగ్ యాప్స్ పై యూట్యూబర్ పోస్ట్.. మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్..

ఈ యాప్స్ జీవితాలను నాశనం చేస్తున్నాయన్న లోకేశ్.. జూదానికి బానిసై యువత నిరాశలోకి వెళ్లడాన్ని ఆపుదామని పిలుపునిచ్చారు.

Nara Lokesh : బెట్టింగ్ యాప్స్ పై యూట్యూబర్ పోస్ట్.. మంత్రి లోకేశ్ సీరియస్ వార్నింగ్..

Nara Lokesh

Updated On : April 18, 2025 / 9:35 PM IST

Nara Lokesh : బెట్టింగ్ యాప్స్ నియంత్రణపై ఏపీ సర్కార్ ఫోకస్ పెట్టింది. సమగ్ర బెట్టింగ్ వ్యతిరేక విధానంపై కృషి చేస్తున్నామని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. నిరంతర అవగాహన, కఠినమైన శిక్షలే బెట్టింగ్ నియంత్రణకు పరిష్కారం అన్నారు. బెట్టింగ్ ముప్పును అంతం చేసేందుకు చట్టపరమైన మార్గాలు అన్వేషిస్తామని చెప్పారు. ఈ యాప్స్ జీవితాలను నాశనం చేస్తున్నాయన్న లోకేశ్.. జూదానికి బానిసై యువత నిరాశలోకి వెళ్లడాన్ని ఆపుదామని పిలుపునిచ్చారు. బెట్టింగ్ యాప్స్ కి సెలబిట్రీల ప్రచారంతో నష్టం జరుగుతోందన్న పోస్టుపై లోకేశ్ స్పందించారు.

”ఏపీలో బెట్టింపు యాప్స్ నిషేధానికి సమగ్ర విధానాన్ని తీసుకొస్తాం. ఇది దేశానికే ఆదర్శంగా ఉండే విధానంగా ఉంటుంది. న్యాయపరమైన అవకాశాలను ఉపయోగించుకుని బెట్టింగ్ సంస్కృతిని ఆపేందుకు ప్రయత్నం చేస్తున్నాం. బెట్టింగ్ యాప్స్ కారణంగా జీవితాలు నాశనం అవుతున్నాయి. అనేక మంది బెట్టింగ్ యాప్స్ కు ఆకర్షితులై ఆర్దికంగా దెబ్బతింటున్నారు. ఇటువంటి పరిస్థితి నుంచి వారిని కాపాడేందుకు అవగాహన కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేస్తాం. బెట్టింగ్ యాప్స్ ద్వారా జీవితాలతో చెలగాటం ఆడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి నారా లోకేశ్ హెచ్చరించారు.

Also Read: అంతా నా ఇష్టం- రాజకీయాల్లోకి రీఎంట్రీపై విజయసాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు

బెట్టింగ్ యాప్స్ కారణంగా యువత జీవితం నాశనమవుతోంది. ఈ ఉచ్చులో చిక్కుకుని అనేకమంది సర్వం కోల్పోతున్నారు. సంపాదించింది మొత్తం కోల్పోతున్నారు. మరో దారి లేక ప్రాణాలు తీసుకుంటున్నారు. దేశవ్యాప్తంగా బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేకమంది బలవుతున్నారు. దీంతో వీటిపై ఉక్కుపాదం మోపాలనే డిమాండ్ దేశవ్యాప్తంగా వినిపిస్తోంది. ఇప్పటికే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యారు.

Also Read: ఏపీలో నెక్ట్స్ టార్గెట్ ఆ మాజీ మంత్రేనా? జైలుకెళ్లడం తప్పదా..?

అసెంబ్లీ వేదికగా కీలక ప్రకటన చేశారు. బెట్టింగ్ యాప్స్, ఆన్‌లైన్ రమ్మీ వంటి ఇతర గేమ్‌ల నిరోధానికి, నిషేధానికి ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు రేవంత్ చెప్పారు. బెట్టింగ్ యాప్‌లపై విచారణ జరిపేందుకు ప్రత్యేక విచారణ బృందాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లను నిర్వహిస్తున్న వారికి విధించే శిక్షను పెంచుతామన్నారు.

మరిన్ని ఇంట్రస్టింగ్ స్టోరీలు, అప్‌డేట్స్ కోసం 10టీవీ వాట్సాప్ చానల్‌ని ఫాలో అవ్వండి.. Click Here