Lokesh : ఏపీ హైకోర్టులో లోకేష్ కు ఊరట.. ముందస్తు బెయిల్ పిటిషన్ క్లోజ్ చేసిన ధర్మాసనం
లోకేష్ ను ముద్దాయిగా చూపనందున అయనను అరెస్టు చేయబోమంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు.

High Court closed Lokesh anticipatory bail plea
High Court – Lokesh Anticipatory Bail : స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ కు ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను హైకోర్టు క్లోజ్ చేసింది. లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ కోర్టుకు తెలిపింది.
ఈ కేసులో లోకేష్ ను ముద్దాయిగా చూపలేదని సీఐడీ తరుపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. లోకేష్ ను ముద్దాయిగా చూపనందున అయనను అరెస్టు చేయబోమంటూ సీఐడీ అధికారులు హైకోర్టుకు వివరించారు. దీంతో ఈ కేస్ ను హైకోర్టు మూసివేసింది.
CM Jagan : పేద ప్రజలకు ఇళ్లు ఇవ్వకుండా కోర్టులకెళ్లిన దుర్మార్గుడు చంద్రబాబు : సీఎం జగన్
కాగా, స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చంద్రబాబు అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్నారు. ఈ కేసులో చంద్రబాబును అరెస్టు చేసిన పోలీసులు ఏసీబీ కోర్టులో హాజరుపర్చారు. కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించడంతో ఆయన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన విషయం తెలిసిందే.
అయితే ఈ కేసులో లోకేష్ ను కూడా అరెస్టు చేస్తారన్న ప్రచారం జరిగింది. దీంతో లోకేష్ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ ను ధర్మాసనం క్లోజ్ చేసింది. దీంతో లోకేష్ కు భారీ ఊరట లభించింది.