AP High Court : మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి : ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

మున్సిపల్ ఎన్నికల పిటిషన్లను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.

AP High Court : మున్సిపల్ ఎన్నికల పిటిషన్లు పరిష్కారానికి ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి : ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

Andhrapradesh High Court Key Orders (1)

Updated On : April 26, 2022 / 3:20 PM IST

AP High Court: ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది.ఏపిలో మున్సిపల్ ఎన్నికల పిటిషన్లను పరిష్కరించేందుకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలని ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రిబ్యునల్స్ జిల్లా న్యాయమూర్తి పరిధిలో ఉండాలని ఆదేశించింది. కర్నూలులో ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడంపై బీజేపీకి చెందిన సుధారాణి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుధారాణి తరుపున న్యాయవాది యలమంజుల బాలాజీ వాదనలు వినిపించారు.

హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్ చట్టంలోని నిబంధనల ప్రకారం ట్రిబ్యునల్ ఏర్పాటు చేయకపోవడం పట్ల బాలాజీ అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒక్క కర్నూలు జిల్లాకే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు ట్రిబ్యునల్స్ ఏర్పాటు చేయాలి కదా అని ధర్మాసనం ప్రశ్నించింది. అన్ని జిల్లాలో మున్సిపల్ ఎన్నికల వివాదాలు పరిష్కరించేందుకు ట్రిబ్యనల్స్ ఏర్పాటు చేయాలని హైకోర్టు ఆదేశించింది.