RRR’s Bail Petition: ఎంపీ రఘురామకు చుక్కెదురు.. బెయిల్ పిటిషన్ కొట్టిసిన హైకోర్టు

Ap High Court Struck Down The Bail Petition Of Mp Raghuram Krishna Raju
Raghurama Krishna Raju: ఏపీ హైకోర్టులో రఘురామకృష్ణరాజుకు చుక్కెదురైంది. రఘురామకృష్ణంరాజు బెయిల్ పిటీషన్ కొట్టివేస్తూ నిర్ణయం తీసుకుంది ఏపీ హైకోర్టు. సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేసుకోవాలని సూచించింది హైకోర్టు.
రఘురామకృష్ణంరాజు హైకోర్టులో దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ బెయిల్ కోసం సిఐడి కోర్టులో ప్రయత్నించమని చెప్పింది హైకోర్టు. రఘురామ తరపు లాయర్ వాదనలను తోసిపుచ్చింది హైకోర్టు. ఎంపీని ప్రాధమిక ఆధారాలు లేకుండా అరెస్ట్ చేసిందంటూ రాజు తరపు లాయర్.
రఘురామ బెయిల్ దరఖాస్తుపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని కింద కోర్టుకు ఆదేశాలు జారీచేసింది హైకోర్టు. వెంటనే రఘురామను రిమాండ్‍కు పంపుతామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా.. తీర్పు కాపీని కూడా వెంటనే ఇస్తామని హైకోర్టు స్పష్టంచేసింది.