AP Home Minister Taneti Vanitha : ఆ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే గోరంట్ల మాధవ్‌పై చర్యలు-హోంమంత్రి తానేటి వనిత

మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే పార్టీ పరంగానూ చర్యలు ఉంటాయన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఒకవేళ అది మార్ఫింగ్ అని తేలితే మార్ఫింగ్ చేసిన వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు.

AP Home Minister Taneti Vanitha : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారంపై ఏపీలో దుమారం కొనసాగుతోంది. ఎంపీ మాధవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇదేం పాడుం పని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో కులాల మధ్య చిచ్చు కూడా రాజేసింది.

Vangalapudi Anitha On Madhav Video : ఎవరు లీక్ చేస్తే ఏంటి? ఆ వీడియోలో ఉన్నది నువ్వా? కాదా? మాధవ్‌పై వంగలపూడి అనిత ఫైర్

కాగా, అది ఫేక్ వీడియో అని మాధవ్ అంటున్నారు. రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. దీని వెనుక టీడీపీ, జనసేన నేతల హస్తం ఉందంటున్నారు. మాధవ్ వీడియో వ్యవహారం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. మాధవ్ పై చర్యలు తీసుకోవాల్సిందేనని టీడీపీ నేతలు డిమాండ్ చేస్తుంటే, నిజానిజాలు నిర్ధారణ కాకుండా ఆరోపణలు చేయడం కరెక్ట్ కాదని వైసీపీ నేతలు ఎదురుదాడికి దిగారు.

Anitha Reddy On Gorantla Madhav Video : గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ నేను కాదు-అనితా రెడ్డి

తాజాగా ఈ వ్యవహారంపై ఏపీ హోంమంత్రి తానేటి వనిత స్పందించారు. మాధవ్ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపామన్నారు. నివేదిక రాగానే చర్యలు తీసుకుంటామన్నారు. మాధవ్ వీడియో మార్ఫింగ్ కాదని తేలితే పార్టీ పరంగానూ చర్యలు ఉంటాయన్నారు హోంమంత్రి తానేటి వనిత. ఒకవేళ అది మార్ఫింగ్ అని తేలితే మార్ఫింగ్ చేసిన వారిపై యాక్షన్ తీసుకుంటామన్నారు. టీడీపీ మహిళా నేతలు తీరుపైనా హోంమంత్రి తానేటి వనిత ఆగ్రహం వ్యక్తం చేశారు. వారి వ్యవహార శైలి దారుణంగా ఉందని దుయ్యబట్టారు. మహిళా సమాజం సిగ్గుపడేలా వారి భాష, బాడీ లాంగ్వేజ్ ఉందన్నారు. మాధవ్ వీడియోపై మహిళా నేతలు రౌండ్ టేబుల్ సమావేశం హాస్యాస్పదంగా ఉందన్నారు హోంమంత్రి వనిత.

MP Rammohan Naidu : ఎంపీ గోరంట్ల మాధవ్‌పై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం భయపడుతోంది-రామ్మోహన్ నాయుడు

”గోరంట్ల మాధవ్ మీద వచ్చిన ఆరోపణలపై ప్రభుత్వ పెద్దలు మాట్లాడటం జరిగింది. ఆ వీడియోని ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపడం జరిగింది. విచారణ జరిగి నివేదిక వచ్చాక తప్పు చేసిన వారు ఎంతటి వారైనా కచ్చితంగా వారిపై చర్యలు తీసుకుంటాం” అని హోంమంత్రి స్పష్టం చేశారు.

ట్రెండింగ్ వార్తలు