Vangalapudi Anitha On Madhav Video : ఎవరు లీక్ చేస్తే ఏంటి? ఆ వీడియోలో ఉన్నది నువ్వా? కాదా? మాధవ్‌పై వంగలపూడి అనిత ఫైర్

విజయాడలో ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి నేతలు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వెనుకేసుకు రావడం దారుణం అన్నారు. ఎంపీ మాధవ్ పై యాక్షన్ తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.

Vangalapudi Anitha On Madhav Video : ఎవరు లీక్ చేస్తే ఏంటి? ఆ వీడియోలో ఉన్నది నువ్వా? కాదా? మాధవ్‌పై వంగలపూడి అనిత ఫైర్

Vangalapudi Anitha On Madhav Video : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎంపీ మాధవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇదేం పాడుం పని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో కులాల మధ్య చిచ్చు కూడా రాజేసింది. రాష్ట్రంలో కమ్మ వర్సెస్ కురుబలా పరిస్థితి తయారైంది. మరోవైపు అది ఫేక్ వీడియో అని మాధవ్ అంటున్నారు. రాజకీయంగా తనను దెబ్బకొట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.

ఇది ఇలా ఉంటే.. మాధవ్ వీడియో కాల్ వ్యవహారంలో టీడీపీ, వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. ఇరు పార్టీల నేతలు సై అంటే సై అంటున్నారు. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేస్తుకుంటున్నారు. తాజాగా టీడీపీ నేత వంగలపూడి అనిత ఎంపీ మాధవ్ పై ఓ రేంజ్ లో విరుచుకుపడ్డారు. వీడియోని ఎవరు లీక్ చేస్తే ఏంటి? అందులో ఉన్నది నువ్వా? కాదా? అని వంగలపూడి అనిత ఎంపీ మాధవ్ ను ప్రశ్నించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

విజయాడలో ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేశారు. గోరంట్ల మాధవ్ పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితి నేతలు. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వెనుకేసుకు రావడం దారుణం అన్నారు. ఎంపీ మాధవ్ పై యాక్షన్ తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు.

Anitha Reddy On Gorantla Madhav Video : గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ నేను కాదు-అనితా రెడ్డి

”ఏకంగా ఒక ఎంపీ స్థాయి వ్యక్తి వీడియో కాల్ లో మాట్లాడుతూ అతడు చేసిన వికృత చేష్టలు, వెకిలి చేష్టలు, పోరంబోకు వేషాలు చూస్తుంటే ఎంత ఇబ్బంది పడకపోతే ఆడపిల్ల బయటకు వచ్చి వీడియో రిలీజ్ చేస్తుంది. దానికి సిగ్గు లేకుండా.. మళ్లీ బయటికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీ నేతలు లీక్ చేశారని అంటున్నారు.

తెలుగుదేశం పార్టీ వాడు లీక్ చేశాడా? లేక జనసేన పార్టీ వాడు లీక్ చేశాడా? అన్నది కాదు. అందులో ఉన్నది నువ్వా ? కాదా? అందులో మాట్లాడుతున్నది నువ్వా? కాదా? నాలుగు గోడల మధ్య జరిగింది మాకేం సంబంధం అని ఓ మంత్రి అంటున్నారు. నాలుగు గోడల మధ్య జరిగింది నాలుగు గోడల మధ్యనే ఉంటే ఎవరూ అడగరు. నాలుగు గోడలను దాటి బయటకు వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది. ఇవాళ ఏపీ పరువు సోషల్ మీడియాలో దిగజారిపోయింది. రాష్ట్ర మహిళలుగా మేము మాట్లాడుతున్నాం” అని వంగలపూడి అనిత ఫైర్ అయ్యారు.

Roja slams tdp leaders: ఎంపీ మాధవ్‌పై వీడియో కాల్‌ నిజమో, కాదో తెలుసుకోకుండా దుష్ప్రచారం: రోజా

”ఇటువంటి వ్యక్తులు ఎంపీగా ఉండటానికి అనర్హులు. జుగుప్సాకరమైన అంశం అంటూనే.. వీడియో నిజం అని తేలితే చర్యలు తీసుకుంటామని సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పడం బాధాకరం. అసలు సజ్జల.. ఇంతవరకు ఎవరి మీద అయినా చర్యలు తీసుకున్నారా? అంబటి రాంబాబు మీద తీసుకున్నావా? అవంతి శ్రీనివాస్ మీద తీసుకున్నావా? మహిళలను అవమానించే విధంగా, మా డిగ్నిటీకి భంగం కలిగించే విధంగా ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియో బయటకు వచ్చిన తర్వాత సుమోటోగా తీసుకుని వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంపైన ఉంది” అని కాంగ్రెస్ నేత సుంకర పద్మశ్రీ అన్నారు.

”నాలుగు గోడల మధ్య జరిగిన దానికి ఎంత ఇంత యాగీ చేస్తున్నారు అని సజ్జల రామకృష్ణారెడ్డి అంటున్నారు. ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు, ప్రజలతో ఎన్నుకోబడినప్పుడు, ప్రజల డబ్బుతో మీరు జీతాలు తీసుకుంటున్నప్పుడు.. ఒక విషయం బయటకు వస్తే అది పబ్లిక్కే అవుతుంది. ప్రతి ఒక్కరూ దాని మీద ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకు సమాధానం చెబితే సరిపోతుంది. అంతేకానీ యాగీలు గీగీలు అని మాట్లాడొద్దు. ఆడపిల్లకు ఇబ్బంది కలిగితే గన్ కన్నా ముందు జగనన్న వస్తాడని చెప్పారు. మహిళా మంత్రులు ఏమయ్యారు? ఎందుకు స్పందించడం లేదు? పక్క వాళ్లు ఏమైనా చేస్తే ఒంటి కాలి మీద లేచిపోయే మహిళా మంత్రులు.. ఇవాళ సొంత పార్టీ వాళ్లే చేస్తే ఎందుకు మౌనంగా ఉన్నారు” అని ఏపీ మహిళా హక్కుల పరిరక్షణ సమితికి చెందిన మహిళ ప్రశ్నించారు.