Anitha Reddy On Gorantla Madhav Video : గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ నేను కాదు-అనితా రెడ్డి

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ లో ఉన్న మహిళ అనితా రెడ్డేనని సోషల్ మీడియాలో పెద్దఎత్తున చర్చ జరిగింది. ఆమె ఫొటో వైరల్ అయ్యింది. దీనిపై అనితా రెడ్డి స్పందించారు. ఆ వీడియోలో ఉన్న మహిళ తాను కాదని తేల్చి చెప్పారు.

Anitha Reddy On Gorantla Madhav Video : గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలో ఉన్న మహిళ నేను కాదు-అనితా రెడ్డి

Anitha Reddy On Gorantla Madhav Video : హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఎంపీ మాధవ్ తీరుపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. బాధ్యతాయుతమైన పదవిలో ఉంటూ ఇదేం పాడుం పని అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గోరంట్ల మాధవ్ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. మాధవ్ వీడియో కాల్ వ్యవహారం ఏపీలో కులాల మధ్య చిచ్చు కూడా రాజేసింది. రాష్ట్రంలో కమ్మ వర్సెస్ కురుబలా పరిస్థితి తయారైంది.

కాగా, ఈ వ్యవహారంలో మరో పేరు తెరమీదకు వచ్చింది. ఆ పేరు అనితా రెడ్డి. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ లో ఉన్న మహిళ అనితా రెడ్డే నని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. అనితా రెడ్డి ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. దీంతో అనితా రెడ్డి స్వయంగా స్పందించారు.

Kamma Vs Kuruba : కులాల మధ్య చిచ్చు రాజేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ లో ఉన్న మహిళ తాను కాదని అనితా రెడ్డి తేల్చి చెప్పారు. గోరంట్ల మాధవ్ వీడియో కాల్ కి సంబంధించి తన ఫొటోలను మార్ఫింగ్ చేసి టీడీపీ, జనసేన నాయకులు దుష్ప్రచారం చేస్తున్నారని గాండ్లపెంటకు చెందిన అనితా రెడ్డి ఆరోపించారు. దీనిపై ఆమె సత్యసాయి జిల్లా పోలీసులను ఆశ్రయించారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో కాల్ లో ఉన్న మహిళ తాను కాదన్నారు అనితా రెడ్డి. అయితే, ఆ వీడియోలో ఉన్నది తానే అంటూ.. తన ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి మానసికంగా వేధిస్తున్నారని గాండ్లపెంట పోలీసులకు ఫిర్యాదు చేశారు అనితా రెడ్డి. వైసీపీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్న తనను టీడీపీ, జనసేన నాయకులు టార్గెట్ చేశారని అనితా రెడ్డి పోలీసులకు తెలిపారు. గతంలోనూ ఇలానే తన భర్త ఫొటోను మార్ఫింగ్ చేసి టీడీపీ, జనసేన నేతలు ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో తనను వేధిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అనితా రెడ్డి పోలీసులను డిమాండ్ చేశారు. 8మందిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనితా రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.

Roja slams tdp leaders: ఎంపీ మాధవ్‌పై వీడియో కాల్‌ నిజమో, కాదో తెలుసుకోకుండా దుష్ప్రచారం: రోజా

కాగా, ఇప్పటివరకు మాధవ్ వీడియో కాల్ లో ఉన్న మహిళ అనితా రెడ్డేనని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఆమె ఫొటో వైరల్ అయ్యింది. దీంతో ఆమె వీడియోలో తాను లేనని, తనపై దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆశ్రయించారు అనితా రెడ్డి.

అనితా రెడ్డి ఆవేదన..
”మాధవ్ వీడియో కాల్ విషయంలో టీడీపీ, జనసేన నాయకులు నన్ను చాలా సతాయిస్తున్నారు. టీడీపీ నేతలు మరింత బరితెగించారు. గోరంట్ల మాధవ్ వీడియో వ్యవహారంలో నా ఫొటో పెట్టి ట్రోల్ చేస్తున్నారు. టీడీపీ ఆఫీస్ నుంచే ఇదంతా చేస్తున్నారని కనుక్కున్నాను. ఇదంతా నారా లోకేశ్ ఇచ్చిన ట్రైనింగ్” అని అనితా రెడ్డి ఆరోపించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

అనితా రెడ్డి 8మందిపై తమకు ఫిర్యాదు చేశారని గాండ్లపెంట పోలీసులు తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.