Kamma Vs Kuruba : కులాల మధ్య చిచ్చు రాజేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు

ఇప్పటికే న్యూడ్ వీడియో కాల్ వివాదంలో ఇరుక్కుపోయిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. మరో కాంట్రవర్సీకి కారణం అయ్యారు. రెండు కులాల మధ్య చిచ్చు రాజేశారు. కమ్మ, కురుబ కులస్తులు సై అంటే సై అంటున్నారు.

Kamma Vs Kuruba : కులాల మధ్య చిచ్చు రాజేసిన ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యాఖ్యలు

Kamma Vs Kuruba : ఇప్పటికే న్యూడ్ వీడియో కాల్ వివాదంలో ఇరుక్కుపోయిన హిందూపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్.. మరో కాంట్రవర్సీకి కారణం అయ్యారు. రెండు కులాల మధ్య చిచ్చు రాజేశారు. కమ్మ, కురుబ కులస్తులు సై అంటే సై అంటున్నారు. కమ్మ కులం పేరుతో గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. కమ్మ కులస్తులను ఉద్దేశించి ఎంపీ గోరంట్ల మాధవ్ చేసిన వ్యాఖ్యలు కులం రంగు పులుముకున్నాయి. కమ్మ, కురుబ సంఘాలు పోటాపోటీగా నిరసన ప్రదర్శనలతో హోరెత్తించాయి.

తమ కులాన్ని అసభ్యపదజాలంతో దూషించారంటూ మాధవ్ కు వ్యతిరేకంగా అనంతపురంలో కమ్మ కులస్తులు శనివారం ర్యాలీ చేయగా.. ఆదివారం గోరంట్ల మాధవ్ కు మద్దతుగా కురుబ కులస్తులు ప్రదర్శన చేపట్టారు. కురుబ కులస్తులు మాధవ్ ను ప్రశంసలతో ముంచెత్తగా కమ్మ కులస్తులు మాధవ్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతూ నిరసన తెలిపారు. మాధవ్ తన పదవికి రాజీనామా చేయాలని, కమ్మ కులస్తులకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

Roja slams tdp leaders: ఎంపీ మాధవ్‌పై వీడియో కాల్‌ నిజమో, కాదో తెలుసుకోకుండా దుష్ప్రచారం: రోజా

మరోవైపు ఎంపీ మాధవ్ కు మద్దతుగా కురుబ కులస్తులు అనంతపురంలో భారీ ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు, నారా లోకేశ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. గోరంట్ల మాధవ్ నిప్పు అని నినాదాలు చేశారు. మాధవ్ జోలికి వస్తే ఊరుకునేది లేదని కురుబ కులస్తులు హెచ్చరించారు. నారా లోకేశ్ పప్పు, గోరంట్ల మాధవ్ నిప్పు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. మానవతా వాది, నిజాయితీపరుడైన మాధవ్ పై కుట్రపూరితంగా ఫేక్ వీడియోలు సృష్టించారని కురుబ కుల సంఘం నేతలు ఆరోపించారు. మాధవ్ ఒక గొప్ప నాయకుడని, అది జీర్ణించుకోలేకే ఇలాంటి ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. స్థానిక ప్రజలు మాధవ్ ను గబ్బర్ సింగ్, డైనమిక్ లీడర్ గా పిలుచుకుంటారని.. అలాంటి గొప్ప నేతపై తప్పుడు ప్రచారం ప్రజలందరిని దిగ్భ్రాంతికి గురి చేస్తోందని కురుబ కులస్తులు వాపోయారు.

కొంతమందిని దృష్టిలో పెట్టుకుని మాత్రమే ఎంపీ గోరంట్ల కామెంట్ చేశారని, ఇద్దరు ముగ్గురి పేర్లు చెప్పినంత మాత్రాన కమ్మ వాళ్లందరూ ఎందుకు ఉలిక్కి పడుతున్నారని ప్రశ్నిస్తున్నారు కురుబ కులస్తులు. తెలుగుదేశం పార్టీ కుల రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు. వీడియో నిజామా? ఫేకా? నిర్ధారణ కాకముందే రచ్చ చేస్తున్నారని కురుబ వర్గం ఆరోపిస్తోంది. కురుబ సామాజిక వర్గం నేతలను చట్టసభల్లోకి రానివ్వకుండా కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు.

Gorantla Madhav Video Call: గోరంట్ల మాధవ్ వ్యవహారంపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి.. ప్రభుత్వాన్ని కోరిన వాసిరెడ్డి పద్మ

మాధవ్ కు వ్యతిరేకంగా కమ్మ కులస్తులు అనంతపురంలో నిరసన తెలిపారు. గోరంట్ల మాధవ్ ఖబర్దార్ అంటూ హెచ్చరించారు. నీ తప్పుని కప్పిపుచ్చుకునేందుకు కమ్మ కులాన్ని దూషిస్తే తరిమి కొడతామని వార్నింగ్ ఇచ్చారు. కమ్మ సంఘం ఆధ్వర్యంలో రామ్ నగర్ లోని కమ్మ భవన్ నుంచి జెడ్పీ ఆఫీస్ ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు. మాధవ్ చిత్రపటాన్ని చెప్పుతో కొడుతూ నిరసన తెలిపారు. మహిళలను గౌరవించని ఎంపీ మాధవ్.. కురుబ కులంలో చెడబుట్టాడంటూ మండిపడ్డారు. ఇలాంటి ఎంపీ సభ్య సమాజంలో ఉండటం ప్రమాదకరం అని, వెంటనే మాధవ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. తప్పు చేయకపోతే నిరూపించుకోవాలి కానీ, ఇలా కులాల మధ్య చిచ్చు పెట్టే విధంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని కమ్మ కుల సంఘం నేతలు హెచ్చరించారు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

మరోవైపు అనంతపురంలో గోరంట్ల ఇంటిని ముట్టడిస్తామన్న కమ్మ కులస్తుల హెచ్చరికలతో పోలీసుల అలర్ట్‌ అయ్యారు. గోరంట్ల ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు.